ETV Bharat / international

కరోనా 'హీరో'లను గుర్తించే సూపర్ ఫాస్ట్ 'బ్లడ్ టెస్ట్'

కరోనా వైరస్​ను ఎదుర్కొనే దిశగా చైనాలో సదరన్​ వైద్య విశ్వవిద్యాలయం పరిశోధకులు ముందడుగు వేశారు. రక్తంలో కరోనాను నిరోధించే ప్రతిరోధకాలను వేగంగా గుర్తించే పరీక్ష విధానాన్ని రూపొందించారు. దీని ఆధారంగా వైరస్​ ప్రభావాన్ని అంచనా వేయొచ్చని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.

VIRUS-BLOOD-TEST
బ్లడ్ టెస్ట్
author img

By

Published : May 1, 2020, 6:05 PM IST

కరోనా వైరస్​ను ఎదుర్కొనేందుకు మానవుల రక్తంలో ఉత్పత్తి అయ్యే ప్రతిరోధకాలను పరీక్షించేందుకు వేగవంతమైన విధానాన్ని అభివృద్ధి చేశారు శాస్త్రవేత్తలు. ఈ పరీక్షల్లో కచ్చితమైన ఫలితాలు వస్తాయని చెబుతున్నారు.

ఈ విధానం ద్వారా ఓ వ్యక్తిపై కరోనా వైరస్​ ప్రభావాన్ని వైద్యులు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇతర పద్ధతుల్లో నెగటివ్​గా తేలిన అనుమానిత వ్యక్తులకు వైరస్​ ఉందో లేదో నిర్ధరించవచ్చు. ఫలితంగా ప్లాస్మా చికిత్సకు అవకాశం ఉంటుందని పరిశోధకులు తెలిపారు.

కొవిడ్- 19 లక్షణాలు ఒక్కొక్కరిలో వివిధ స్థాయిల్లో ఉంటున్నాయి. కొంతమందిలో లక్షణాలే కనిపించటం లేదు. ఫలితంగా ధ్రువీకరించిన కేసులు కన్నా వాస్తవంగా చాలా మందికి వైరస్ సోకి ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఆలోచన ఇలా..

అయినప్పటికీ ఈ విషయంలో మరింత పరిశోధన చేయాల్సి ఉంది. ఒక వ్యక్తిలో యాంటీబాడీలు ఉత్పత్తి అయితే.. భవిష్యత్తులో అతనికి కరోనా నుంచి రోగ నిరోధక శక్తి ఉంటుందా అనే విషయాన్ని తెలుసుకోవాల్సి ఉందని అంటున్నారు శాస్త్రవేత్తలు.

కరోనాతో ఎంతమంది ప్రభావితమయ్యారో గుర్తించేందుకు ఒక వేగవంతమైన పరీక్షను రూపొందించాలని చైనాలోని సదరన్ వైద్య విశ్వవిద్యాలయం పరిశోధకులు ప్రయత్నాలు ప్రారంభించారు. 'లేటరల్ ఫ్లో ఇమ్యూనోస్సే' (ఎల్​ఎఫ్​ఏ) పద్ధతి ఆధారంగా టెస్ట్​ను రూపొందించారు. ఇది సాధారణంగా ఇంట్లోనే గర్భిణి పరీక్షలు చేసుకునేందుకు ఈ తరహా పరీక్షలను ఉపయోగిస్తారు.

ఎలా చేస్తారు?

ఒక నైట్రోసెల్యూలోజ్​ స్ట్రిప్​పై వైరల్ కోట్ ప్రోటీన్​ను అతికిస్తారు. దానిపై మానవుల సీరం కలుపుతారు. ఆ స్ట్రిప్​పై సీరమ్​ ఒక వైపు నుంచి మరో వైపునకు ప్రవహిస్తుంది. అందులో సీరంలో కరోనాకు వ్యతిరేకంగా పోరాడే యాంటీబాడీలు ఉన్నట్లయితే అవి వైరల్ ప్రోటీన్​ వద్దకు చేరతాయి.

ఈ విధంగా కరోనా ప్రతిరోధకాలను కచ్చితత్వంతో పరిశోధకులు గుర్తిస్తారు. ఇది ఇతర ఎల్​ఎఫ్​ఏ టెస్ట్​లకన్నా చాలా కచ్చితమైన ఫలితాలను ఇస్తుంది.

ఈ పరీక్ష ఆధారంగా ఏడుగురు కరోనా బాధితులు, 12 మంది అనుమానితులు (లక్షణాలు ఉన్నా నెగటివ్ వచ్చినవారు) సీరంపై పరీక్షలు నిర్వహించగా.. కచ్చితమైన ఫలితాలు 10 నిమిషాల్లోనే వచ్చినట్లు పరిశోధకులు చెబుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.