ETV Bharat / international

Kabul Attack: కాబుల్​లో తీవ్ర ఉద్రిక్తత.. ఆ వాహనంపై అమెరికా వైమానిక దాడి

Explosion heard in Afghanistan's capital Kabul, reports local media
అఫ్గాన్ రాజధాని కాబుల్​లో పేలుడు!
author img

By

Published : Aug 29, 2021, 6:26 PM IST

Updated : Aug 29, 2021, 8:59 PM IST

18:23 August 29

అమెరికా వైమానిక దాడి

అఫ్గానిస్థాన్​ రాజధాని కాబుల్​ మారోమారు పేలుళ్లతో దద్దరిల్లింది. తీవ్ర ఉద్రిక్తతల మధ్య మరో భారీ ఉగ్రకుట్రను అమెరికా సైన్యం అడ్డుకోగలిగింది! కాబుల్​ విమానాశ్రయంవైపు దూసుకెళుతున్న ఐసిస్​కు చెందిన ఓ వాహనాన్ని వైమానిక దాడులతో ధ్వంసం చేసింది అగ్రరాజ్యం. ఈ నేపథ్యంలో రెండో పేలుడుకు సంబంధించి శబ్దాలు వినిపించాయి. దీంతో ఆ వాహనంలో భారీ మొత్తంలో బాంబులున్నాయన్నది రుజువైందని అగ్రరాజ్యం పేర్కొంది.

"కాబుల్​లోని ఓ వాహనంపై అమెరికా భద్రతా దళం.. ఆదివారం సెల్ఫ్​ డిఫెన్స్​ అన్​మాన్డ్​ ఓవర్​ ది హారిజాన్​ వైమానిక దాడులను జరిపింది. కాబుల్​ విమానాశ్రయానికి పొంచి ఉన్న ఉగ్రముప్పును తొలగించేందుకే ఈ చర్యలు చేపట్టింది. లక్ష్యాన్ని ఛేదించినట్టు మాకు నమ్మకం ఉంది. అదే సమయంలో ఆ వాహనం నుంచి భారీ పేలుడు శబ్దాలు బయటకు వచ్చాయి. దీంతో ఆ వాహనంలో విస్ఫోటకాలు ఉన్నట్టు స్పష్టమైంది. ఈ పూర్తివ్యవహారంలో పౌరులకు ఏమైనా అయ్యిందా? అనే అంశాన్ని పరిశీలిస్తున్నాము. ఇప్పటివరకు అలాంటి సమాచారం ఏదీ మాకు అందలేదు."

--బిల్​ అర్బన్​, యూఎస్​ సెంట్రల్​ కమాండ్​ ప్రతినిధి.

అంతకుముందు.. కాబుల్​లోనే రాకెట్​ దాడి జరిగినట్టు వార్తలొచ్చాయి. విమానాశ్రయానికి వాయువ్య ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు సమాచారం అందింది. ఇందులో ఓ చిన్నారి మరిణించినట్టు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. అయితే అమెరికా వైమానిక దాడి, రాకెడ్​ దాడి ఒకటేనా? లేక రెండూ వేరువేరా? అన్న అంశంపై ఇంకా స్పష్టత లేదు.

మూడోసారి

విమానాశ్రయ ప్రాంగణం బాంబుల శబ్దాలతో దద్దరిల్లడం నాలుగు రోజుల్లో ఇది మూడోసారి. గురువారం విమానాశ్రయం వద్ద ఐసిస్​కే ఉగ్ర సంస్థ ఆత్మహుతి దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో 180కిపైగా మంది మరణించారు. వీరిలో అమెరికా సైనికులు కూడా ఉన్నారు. ఈ ఘటనకు కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని అమెరికా తేల్చిచెప్పింది. చెప్పినట్టుగానే అఫ్గాన్​లో ఐసిస్​ బృందంపై శనివారం వైమానిక దాడి జరిపింది.

Last Updated : Aug 29, 2021, 8:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.