ETV Bharat / international

'ఈ వారంలోనే భారత్​-చైనా కమాండర్ల భేటీ' - చైనా భారత్​ శాంతి చర్చలు

భారత్- చైనా మధ్య 8వ రౌండ్ సైనిక చర్చలు ఈ వారంలో జరగనున్నాయి. సరిహద్దులో బలగాల ఉపసంహరణ ప్రక్రియను వేగవంతం చేసే దిశగా ఇరు దేశాలు చర్చించనున్నాయి.

Eighth round of Corps Commander level talks between India, China likely this week
ఈ వారంలోనే చర్చలు.. సిద్ధమవుతున్న ఇరు దేశాలు
author img

By

Published : Oct 26, 2020, 6:56 AM IST

భారత్​-చైనా మధ్య 8వ దఫా కార్ప్స్​ కమాండర్ స్థాయి చర్చలు ఈ వారంలో జరగనున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తూర్పు లద్దాఖ్​లోని వాస్తవాధీన రేఖ వెంబడి బలగాల ఉపసంహరణే లక్ష్యంగా ఇరు దేశాలు చర్చలు జరపనున్నట్టు తెలుస్తోంది.

రెండు దేశాలకు ఈ దఫా చర్చలు అత్యంత ముఖ్యమైనవి. పాంగాంగ్​ సరస్సు ఉత్తర, దక్షిణ తీరాలతో పాటు ఉద్రిక్తతలు నెలకొన్న ఇతర ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో బలగాల ఉపసంహరణపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముండటమే ఇందుకు కారణం.

"ఈ వారంలోనే 8వ విడత చర్చలు జరగనున్నాయి. అందుకోసం భారత్​-చైనా దేశాలు సిద్ధమవుతున్నాయి."

-- ప్రభుత్వ వర్గాలు.

8వ విడత కార్ప్స్​ కమాండర్​ స్థాయి చర్చల్లో భారత్​ తరఫున 14 కార్ప్స్​ కమాండర్​ లెఫ్టి​నెంట్​ జనరల్​ పీజీకే మీనన్ నేతృత్వం వహించనున్నారు. నాలుగు నెలలుగా భారత్​, చైనాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతుండగా.. పాంగాంగ్​ సరస్సులోని కీలకమైన స్థావరాలపై భారత్​ పట్టు సాధించింది.

ఇదీ చూడండి:నేపాల్​నూ వదలని చైనా- సరిహద్దులో దురాక్రమణలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.