ETV Bharat / international

అమ్మాయి పంచ్​కు విమానం అద్దం ఢమాల్​..

సాంకేతిక కారణాలు, తీవ్ర అనారోగ్యం, వాతావరణ ప్రతికూలత వంటి పరిస్థితులు ఎదురైనప్పుడే విమానాలను అత్యవసరంగా ల్యాండ్ చేయడం చూస్తుంటాం. కానీ ఓ మహిళ తాగి చేసిన రచ్చ భరించలేక ఓ విహంగాన్ని కిందకి దించేశారు అధికారులు.

drunken women
మద్యం మత్తులో
author img

By

Published : Jun 16, 2020, 3:04 PM IST

గగనతలంలోకి ప్రవేశించిన ఓ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్​ చేశారు చైనా అధికారులు. ఇందుకు కారణం ఓ మహిళ తాగి అద్దం పగలకొట్టడమే. వివరాల్లోకి వెళితే.. 29 ఏళ్ల లీ తాగి విమానం ఎక్కింది. తూర్పు చైనాలోని జినింగ్​ నుంచి బయలుదేరిన ఈ విహంగం మార్గమధ్యంలో ఉండగా.. ఆమె విచిత్రంగా ప్రవర్తిస్తూ గందరగోళం చేసింది. పెద్దగా కేకలు వేస్తూ అక్కడున్న వారిని భయభ్రాంతులకు గురిచేసింది. అంతేకాకుండా అదే నిషాతో ఉన్న లీ.. ఒక్క గుద్దుతో విమానం అద్దాన్ని బ్రేక్​ చేసింది. పక్కనే ఉన్న ప్రయాణికులు, సిబ్బంది అదుపుచేసినా.. ఆమె ఆవేశం తగ్గలేదట. ఇక లాభం లేదని భావించిన సిబ్బంది.. హెనన్​ రాష్ట్రంలోని ఝన్​ఝాంగౌలో అత్యవసరంగా విమానాన్ని దించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు.

flight glass broken
పగిలిన అద్దం

లీ ప్రేమ వ్యవహారం దెబ్బతినడం వల్లే మానసికంగా ఒత్తిడికి గురై.. ఈ విధంగా చేసినట్లు విచారణలో తేలింది. ఆమె చైనాలో విరివిగా దొరికే 'బైజియు' అనే మందు తాగిందని ఇందులో 35 శాతం నుంచి 65 శాతం ఆల్కహాల్​ ఉంటుందని తెలిపారు. సోషల్​మీడియాలో ఆమె బ్రేక్​ చేసిన అద్దం ఫొటోలు ప్రస్తుతం వైరల్​ అవుతున్నాయి.

ఇదీ చూడండి: ప్రత్యేక హెలికాప్టర్​లో గొరిల్లా.. కారణమేంటంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.