ETV Bharat / international

వైరస్​ తీవ్రతను చైనా అందుకే దాచిందా? - కరోనా వైరస్​ అమెరికా

ఔషధాల దిగుమతి కోసమే కరోనా వైరస్​ తీవ్రతను ప్రపంచం నుంచి చైనా దాచిపెట్టిందని అమెరికా హోంల్యాండ్​ భద్రతా విభాగం ఓ నివేదికను రూపొందించింది. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థకు కూడా నిజమైన వివరాలు ఇవ్వలేదని పేర్కొంది.

DHS report: China hid virus' severity to hoard supplies
వైరస్​ తీవ్రతను చైనా అందుకే దాచిందా?
author img

By

Published : May 4, 2020, 10:38 AM IST

కరోనా వైరస్​పై చైనా చాలా విషయాలను దాచిపెట్టిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఇప్పటికే అనేకమార్లు ఆరోపించారు. తాజాగా వీటికి ఊతమందిస్తూ.. అగ్రరాజ్య హోంల్యాండ్​ భద్రతా విభాగం(డీహెచ్​ఎస్​) ఓ నివేదికను రూపొందించింది. మహమ్మారిని కట్టడి చేయడానికి సరిపడా మందులను పోగుచేయడం కోసమే వైరస్​ విజృంభణ, దాని తీవ్రతను చైనా కప్పిపుచ్చిందని పేర్కొంది.

"ఓవైపు వైరస్​ తీవ్రతను తక్కువ చేసి చూపిస్తూనే.. మరోవైపు ఔషధాల దిగుమతులు పెంచింది చైనా. ఎగుమతులను తగ్గించింది. ఈ విషయం బయటకు రాకుండా.. ఎగుమతులపై ఆంక్షలు ఉన్నాయని, డేటాలో లోపాలున్నాయని కప్పిపుచ్చింది."

--- హోంల్యాండ్​ భద్రతా విభాగం

వైరస్​ ఇతరులకు సంక్రమిస్తుందనే విషయం.. జనవరి చివరి వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ)కు చైనా చెప్పలేదని పేర్కొంది డీహెచ్​ఎస్​. ఔషధాల దిగుమతే ఇందుకు కారణమని నివేదికలో వెల్లడించింది. ఫేస్​ మాస్కులు, సర్జికల్​ గౌన్లు, గ్లవ్స్​ దిగుమతులు ఒక్కసారిగా పెరిగాయని తెలిపింది.

వైరస్​ తీవ్రతను చైనా నేతలు ఉద్దేశపూర్వకంగానే దాచిపెట్టారని మే 1న ఈ నాలుగు పేజీల రిపోర్టు రూపొందించింది. వైరస్​ను నియంత్రించడంలో ట్రంప్​ ప్రభుత్వం విఫలమైందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నివేదిక బయటకు రావడం గమనార్హం.

అయితే మందుల కోసమే చైనా అసలు నిజాన్ని దాచిపెట్టింది అని అనడానికి సరైన ఆధారాలు లేవు.

ఇదీ చూడండి:- 'ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు అమెరికా సిద్ధం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.