ETV Bharat / international

'పాఠశాల'లో బాంబు పేలుళ్లు- 50కి చేరిన మృతులు

అఫ్గానిస్థాన్​లో ఓ పాఠశాల వద్ద శనివారం జరిగిన పేలుళ్లలో మరణాల సంఖ్య 50కి పెరిగింది. మృతుల్లో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారని అక్కడి ప్రభుత్వం తెలిపింది.

Bomb blast
బాంబుదాడి, పేలుడు
author img

By

Published : May 9, 2021, 11:46 AM IST

అఫ్గాన్​ రాజధాని కాబుల్​లోని ఓ పాఠశాలపై జరిగిన బాంబు దాడి ఘటనలో మృతుల సంఖ్య 50కి చేరింది. మరణించిన వారిలో ఎక్కువ మంది 11-15 ఏళ్ల వయసు విద్యార్థులే ఉన్నారని ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ ఆదివారం వెల్లడించింది. ఈ ఘటనలో మరో 100 మందికిపైగా గాయపడినట్టు తెలిపింది.

ఏం జరిగిందంటే?

కాబుల్​ పశ్చిమ ప్రాంతంలోని షియా పరిసరాల్లో.. రోజూలాగే విద్యార్థులు పాఠశాలకు వెళ్తున్నారు. ఆ సమయంలో ప్రవేశ ద్వారానికి వెలుపల మూడు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో శనివారం 30 మంది దుర్మరణం పాలవ్వగా.. అనేక మంది గాయపడ్డారు.

ఏ ఉగ్రవాద సంస్థ ఈ దాడులకు పాల్పడిందో తెలియలేదు. అయితే.. ఇటీవల అదే ప్రాంతంలో షీతేస్​ మైనార్టీలపై దాడి చేసిన ఇస్లామిక్​ స్టేట్ ఉగ్రవాద సంస్థపై ఎక్కువగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు, ఈ ఘటనను తాలీబన్లు ఖండించారు. దాడికి తాము బాధ్యులం కాదని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: సముద్రంలో పడిపోయిన చైనా రాకెట్ శకలాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.