ETV Bharat / international

అత్యంత కచ్చితత్వంతో కొవిడ్​ను పసిగట్టే 'పాస్​పోర్ట్​'

మనిషి లాలాజలాన్ని పరీక్షించి కరోనా వైరస్​ ఆనవాళ్లను పట్టేసే విధంగా వినూత్నమైన యాంటిజెన్​ రాపిడ్​ టెస్ట్​ని సింగపూర్​ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది కొవిడ్​-19ను అత్యంత కచ్చితత్వంతో శరవేగంగా గుర్తిస్తుందని అంటున్నారు. దీనికి 'ప్యార్లల్‌ యాంప్లిఫైడ్‌ సెలైవా, ర్యాపిడ్‌ పాయింట్‌ ఆఫ్‌ కేర్‌ టెస్ట్‌' (పాస్‌పోర్ట్‌) అని పేరు పెట్టారు.

antigen rapid test
అత్యంత కచ్చితత్వంతో కొవిడ్​ను పసిగట్టే 'పాస్​పోర్ట్​'
author img

By

Published : Dec 11, 2021, 8:10 AM IST

కొవిడ్‌-19ను అత్యంత కచ్చితత్వంతో శరవేగంగా గుర్తించడానికి వినూత్నమైన యాంటిజెన్‌ రాపిడ్‌ టెస్ట్​ను (ఏఆర్‌టీ) సింగపూర్‌ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది ఓ వ్యక్తి లాలాజలాన్ని పరీక్షించి కరోనా వైరస్‌ ఆనవాళ్లను పట్టేస్తుంది. దీన్ని ఎవరికివారు సొంతంగా నిర్వహించుకోవచ్చు. ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఇతర ఏఆర్‌టీ పరీక్షల కన్నా చాలా మెరుగైన ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రామాణిక పాలీమరేజ్‌ చైన్‌ రియాక్షన్‌ (పీసీఆర్‌) పరీక్షలకు ఏ మాత్రం తీసిపోదని వివరించారు.

ఎందుకు?

కొవిడ్‌-19కు నోటి ద్వారా ఇచ్చే మందులు అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో భవిష్యత్‌లో ఈ ఇన్‌ఫెక్షన్‌ను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్దే గుర్తించి, చికిత్స చేసే పరిస్థితులు వస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అక్కడికక్కడే పరీక్ష నిర్వహించే వెసులుబాటు వల్ల కొవిడ్‌ను మరింత కచ్చితత్వంతో, వేగంగా గుర్తించి, సరైన ఔషధాలను సూచించడానికి వీలవుతుంది.

ఏమిటీ పరీక్ష?

ఈ పరీక్షకు 'ప్యార్లల్‌ యాంప్లిఫైడ్‌ సెలైవా, ర్యాపిడ్‌ పాయింట్‌ ఆఫ్‌ కేర్‌ టెస్ట్‌' (పాస్‌పోర్ట్‌) అని పేరు పెట్టారు. దీనిద్వారా నిమిషాల్లోనే ఫలితాన్ని రాబట్టవచ్చు. ఇందుకు అదనపు సాధనాలు, ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బంది అవసరం లేదు.

సాధారణంగా ముక్కు, గొంతు నుంచి సేకరించే స్వాబ్‌లతో పోలిస్తే లాలాజల ఆధారిత పరీక్షలు చాలా సులువుగా ఉంటాయి. అయితే ప్రస్తుతం విస్తృతస్థాయిలో వినియోగానికి ఇవి అనువుగా లేవు. దీనికి కారణం ఒక వ్యక్తి ఏదైనా తిన్నా, తాగినా వెంటనే లాలాజలంలో వైరల్‌ రేణువుల స్థాయి భారీగా పడిపోతుంది. అందువల్ల ఉదయాన్నే పరగడుపున పళ్లు తోముకోవడానికి ముందు నిర్వహిస్తేనే ఈ పరీక్ష ద్వారా కచ్చితమైన ఫలితం వస్తుంది.

రెండు అంచెలతో..

లాలాజల పరీక్షలతో ఉన్న ఇబ్బందులను అధిగమించడానికి సింగపూర్‌ శాస్త్రవేత్తలు రెండు అంచెల విధానాన్ని ఉపయోగించారు. ఇందులో వైరస్‌కు అంటుకోవడానికి మొదట ఒకరకం నానో రేణువులను ఉపయోగించారు.

ఆ తర్వాత రెండో రకం నానోరేణువులనూ ప్రయోగించారు. ఇవి వెళ్లి.. మొదటి నానో రేణువులతో బంధనం ఏర్పరిచాయి. తద్వారా వైరస్‌ ఉనికిని తెలియజేసే సంకేత బలం పెరిగింది. వైరస్‌ను మరింత మెరుగ్గా గుర్తించడానికి వీలైంది.

ఈ పరీక్షను ఏ సమయంలోనైనా నిర్వహించొచ్చు. రోగి లాలాజల నమూనాలో వైరల్‌ లోడు చాలా స్వల్పంగా ఉన్నప్పటికీ ఈ విధానం పసిగట్టేస్తుంది.

ఇదీ చూడండి:- యాంటీజెన్​ టెస్ట్​, ఆర్​టీ- పీసీఆర్​కు తేడా ఇదే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.