ETV Bharat / international

'లక్షణాలు బయటపడే 3 రోజుల ముందు నుంచే వ్యాప్తి'

కరోనా వైరస్ ఓ వ్యక్తి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఎన్ని రోజులకు ప్రభావం చూపిస్తుంది? వైరస్​ సోకిన తర్వాత ఇతరులకు వ్యాపించడానికి ఎంత సమయం పడుతుంది? అనే విషయాలపై అధ్యయనం చేశారు హాంకాంగ్​ విశ్వవిద్యాలయ పరిశోధకులు. ఏ సమయంలో చికిత్స అందిస్తే బాధితులు కోలుకుంటారో ఈ అధ్యయనం ద్వారా గుర్తించారు.

COVID-19 patients spread virus two to three days before symptoms appear: Study
'లక్షణాలకు 3 రోజుల ముందు నుంచే ఇతరులకు కరోనా వ్యాప్తి'
author img

By

Published : Apr 16, 2020, 11:28 AM IST

కరోనా సోకిన వ్యక్తిలో ప్రాథమిక లక్షణాలు కనిపించడానికి 2, 3 రోజుల ముందు నుంచే వైరస్​ ఇతరులకు వ్యాప్తి చెందుతుందని ఓ అధ్యయనం తేల్చింది. వైరస్ సోకిన తర్వాత 7 రోజుల ఇంక్యుబేషన్ కాలం ఉంటుందని, ఆ తర్వాత ప్రాథమిక లక్షణాలు కనిపిస్తాయని గుర్తించారు హాంకాంగ్​ పరిశోధకులు. ఇందుకు సంబంధించిన పరిశోధన పత్రాన్ని నేచర్ మెడిసిన్​ పత్రికలో ప్రచురించారు.

ఈ అధ్యయనం ప్రకారం కరోనా వైరస్ సంక్రమణ, వ్యాధి వ్యాప్తి చెందే మధ్య కాలం అత్యంత కీలకమని చెప్పారు హాంకాంగ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు. వైరస్​ తొలి దశ లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స అందిస్తే మహమ్మారిని కట్టడి చేయవచ్చని నివేదించారు.

414 నమూనాలపై అధ్యయనం

ఈ అధ్యయనం కోసం చైనాలోని గ్వాంగ్జౌ పీపుల్స్ ఆసుపత్రి​లో చేరిన 94 మందిపై పరిశోధన చేశారు. లక్షణాలు కనిపించినప్పటి నుంచి 32 రోజుల వరకు వారి నోటి స్రావాలను సేకరించి పరీక్షించారు. మొత్తం 414 నమూనాలపై అధ్యయనం చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు.

వైరస్​ సోకిన తర్వాత లక్షణాలు కనిపించటానికి 7 రోజుల సమయం పడుతుందని గుర్తించారు. ప్రాథమిక లక్షణాలు బయటపడక ముందు 2,3 రోజుల నుంచే ఇతరులకు వైరస్ సంక్రమించే అవకాశం ఉందని తెలిపారు.

శరీరంలో వైరస్​ తీవ్రత పెరగడానికి 7 రోజుల సమయం పడుతుందని గుర్తించారు. వ్యాధి తొలి దశ లక్షణాలు బయటపడిన వెంటనే చికిత్స అందించిన వారిలో 44 శాతం మంది వేగంగా కోలుకున్నట్లు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.