ETV Bharat / international

కొనసాగుతున్న కొవిడ్ విధ్వంసం.. అక్కడ మళ్లీ లాక్​డౌన్​ - pakisthan corona news

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ విధ్వంసం కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య కోటి 85 లక్షలకు చేరువైంది. మరణాల సంఖ్య 7లక్షలకు సమీపించింది. దక్షిణ కొరియాలో మళ్లీ కొత్త కేసులు నమోదవుతున్నాయి. వైరస్​ వ్యాప్తిని అదుపు చేసేందుకు మెల్​బోర్న్​ నగరంలో మరోసారి లాక్​డౌన్​ను అమలు చేయనుంది ఆస్ట్రేలియా ప్రభుత్వం.

Global COVID-19 tracker
కొనసాగుతున్న కొవిడ్ విధ్వంసం.. అక్కడ మళ్లీ లాక్​డౌన్​
author img

By

Published : Aug 4, 2020, 8:59 PM IST

కరోనా మహమ్మారి విలయతాండవం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య కోటి 84 లక్షల 89వేల 613కు చేరింది. వైరస్​ కారణంగా మరణించిన వారి సంఖ్య 6లక్షల 98వేల 510కి పెరిగింది. కోటి 17లక్షల 16వేల 827మంది వ్యాధి బారినపడి కోలుకున్నారు.

సింగపూర్​లో కొత్తగా 295 వైరస్​ కేసులు నమోదయ్యాయి. వీరిలో ఎక్కువగా విదేశాలకు చెందిన కార్మికులే ఉన్నట్లు అధికారులు తెలిపారు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 53వేల 346కి చేరింది. ఇప్పటివరకు 27మంది ప్రాణాలు కోల్పోయారు.

పాక్​లో..

పాకిస్థాన్​లో మరో 432మందికి వైరస్​ సోకగా..15మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 280,461కి చేరగా.. మృతుల సంఖ్య 5,999కి పెరిగింది.

దక్షిణ కొరియాలో..

దక్షిణకొరియాలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. 24 గంటల్లో 34మందికి పాజిటివ్​గా తేలింది. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 14,423గా నమోదైంది. ఇప్పటివరకు 301మంది వైరస్​కు బలయ్యారు.

మళ్లీ లాక్​డౌన్​..

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆస్ట్రేలియాలో రెండో అతిపెద్ద నగరమైన మెల్​బోర్న్​లో రెండోసారి లాక్​డౌన్​ విధించనున్నారు. వచ్చే 6 వారాల పాటు ఆంక్షలు అమలు చేయనున్నారు. దీని వల్ల దాదాపు 2,50,000 మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇదీ చూడండి: 'కరోనా వల్ల ఇప్పుడు భారత్​కే అసలు సమస్య'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.