ETV Bharat / international

చైనాలో మళ్లీ కరోనా గుబులు- సామూహిక పరీక్షలు మొదలు

ప్రపంచంపై కరోనా వైరస్​ విజృంభణ కొనసాగుతోంది. చైనాలో వైరస్​ స్పీడు పెంచడం వల్ల సామూహిక పరీక్షలు నిర్వహిస్తోంది ప్రభుత్వం. ముఖ్యంగా కరోనా వ్యాప్తికి కారణమైన బీజింగ్​లోని ఓ మార్కెట్​కు వెళ్లిన వారిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. మరోవైపు పాకిస్థాన్​లోని పంజాబ్​ రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 1000కి చేరింది.

COVID-19: China begins mass testing in Beijing as 67 new cases appear
చైనాలో మళ్లీ తిరగబడ్డ కరోనా.. సామూహిక పరీక్షలు మొదలు
author img

By

Published : Jun 15, 2020, 8:20 PM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్​ కేసులు 80 లక్షలు దాటిపోయాయి. 4 లక్షల 36 వేల 276 మంది ప్రాణాలు కోల్పోయారు. 41లక్షల 48 వేల 120 మంది రికవరీ అయ్యారు.

దేశంకేసులుమృతులు
అమెరికా21,62,8641,17,865
బ్రెజిల్​8,67,88243,398
రష్యా5,37,2107,091
బ్రిటన్​295,88941,698
స్పెయిన్​2,91,00827,136
ఇటలీ2,36,98934,345
పెరూ2,29,7366,688
ఇరాన్​1,89,8768,950
జర్మనీ1,87,7068,873

చైనాలో సామూహిక పరీక్షలు...

బీజింగ్​లో వైరస్​ మరోమారు విజృంభిస్తోన్న నేపథ్యంలో సామూహిక పరీక్షలను ప్రారంభించింది చైనా. బీజింగ్​లో వైరస్​ కేంద్రబిందువుగా మారిన జిన్​ఫడి మార్కెట్​ను సందర్శించిన వారిని పట్టుకోవడం కోసమే ఈ చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు 29వేల 386 మందికి పరీక్షలు నిర్వహించగా.. 12 వేల 973 మందికి వైరస్​ నెగెటివ్​గా తేలింది. మిగతా నమూనాల ఫలితాలు వెలువడాల్సి ఉంది.

పాక్​లో...

పాకిస్థాన్​లో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. వైరస్​ బారినపడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య ఆందోళనకరంగా మారింది. దేశంలోని ఒక్క పంజాబ్​ రాష్ట్రంలోనే మరణాల సంఖ్య 1000కి చేరింది. పంజాబ్​లో గత 24గంటల్లో మొత్తం 1,537 మందికి వైరస్​ సోకింది.

అయితే పాకిస్థాన్​లో కొత్తగా 5,248 కేసులు వెలుగుచూశాయి. 97 మంది మరణించారు.

విమాన సేవలపై నిషేధం...

నేపాల్​ను కూడా కరోనా వైరస్​ వణికిస్తోంది. మొత్తం కేసుల సంఖ్య 6000 దాటింది. ఈ నేపథ్యంలో దేశీయ, విదేశీ ప్రయాణ సేవలపై ఉన్న నిషేధాన్ని జులై 5వరకు కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేసింది అక్కడి ప్రభుత్వం.

విదేశీ కార్మికులపై పంజా...

సింగపూర్​లోని విదేశీ కార్మికులు కరోనా భయంతో విలవిల్లాడిపోతున్నారు. తాజాగా వారిలోని 214 మందికి కరోనా నిర్ధరణయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 40,818కు చేరింది. 26 మంది మరణించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.