ETV Bharat / international

సింగపూర్​లో 59 మంది భారతీయులకు కరోనా - covid cases in singapore

సింగపూర్​లో కరోనా బాధితుల సంఖ్య అధికమవుతోంది. ఇందులో భారతీయుల కేసులు పెరగడం అక్కడి ప్రవాసులను కలవరపెడుతోంది. కొత్తగా 223 మంది బాధితులను గుర్తించిన సింగపూర్ ప్రభుత్వం.. అందులో 59 భారతీయులు ఉన్నట్లు స్పష్టం చేసింది.

59 indians in singapore infected with coronavirus
సింగపూర్​లో భారతీయులకు కరోనా
author img

By

Published : Apr 13, 2020, 12:38 PM IST

సింగపూర్​లో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కొత్తగా 233 కేసులు నమోదుకాగా మొత్తం బాధితుల సంఖ్య 2,532కు చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో 59 మంది భారతీయులు ఉన్నట్లు అక్కడి ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటివరకు ఆ దేశంలో ఎనిమిది మంది వైరస్​కు బలయ్యారు.

కొత్తగా నమోదైన వాటిలో 51 కేసులు వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న క్లస్టర్లకు సంబంధించినవని ఆరోగ్య శాఖ పేర్కొంది. 15 మందికి వైరస్ బాధితులతో సంబంధం ఉన్నట్లు గుర్తించింది. మిగిలిన 167 మందికి మాత్రం ఇంతకుముందు వైరస్ కేసులతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. వైరస్ వ్యాపిస్తున్న మరో ఏడు క్లస్టర్లను గుర్తించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

కొందరి పరిస్థితి విషమం

31 మంది బాధితుల ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్లు ఆ దేశ వైద్య శాఖ ప్రకటించింది. 988 మంది ఆరోగ్యం మెరుగ్గానే ఉన్నప్పటికీ.. కొవిడ్ పరీక్షల్లో పాజిటివ్​గా తేలినట్లు స్పష్టం చేసింది. వారందరికీ మెరుగైన సదుపాయాలతో ఐసోలేషన్​లో ఉంచినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

భారత సంతతికి చెందిన ముస్తఫా సెంటర్ షాపింగ్ మాల్​కి సంబంధం ఉన్న నాలుగు కేసులను గుర్తించినట్లు ప్రభుత్వం పేర్కొంది. కాగా.. ఈ ప్రాంతం నుంచి మొత్తం 82 కేసులు వెలుగులోకి వచ్చాయి.

ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి నియంత్రణ చర్యలు ముమ్మరం చేశారు అధికారులు. మాస్కులు లేకుండా బయటకు వచ్చే వారికి మార్కెట్లలోకి అనుమతి నిషేధిస్తున్నారు. దేశంలో ఏప్రిల్ 7 నుంచి మే 4 వరకూ సర్క్యూట్ బ్రేకింగ్ పీరియడ్ పేరిట లాక్​డౌన్ విధించారు.

ఇదీ చదవండి: కరోనా భయాలు బేఖాతరు- 'యుద్ధ' వ్యూహాల్లో కిమ్​ బిజీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.