ETV Bharat / international

'లాక్​డౌన్​ అనవసరం.. తర్వాత చూద్దాం' - కరోనా వార్తలు

కరోనా వైరస్​ కారణంగా పాకిస్థాన్​లో ప్రస్తుతం లాక్​డౌన్​ విధించబోమని ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్​ ఖాన్​ వెల్లడించారు. అలాంటి నిర్ణయం వల్ల దేశంలో గందరగోళ పరిస్థితులు నెలకొంటాయని పేర్కొన్నారు. ఇటలీ, ఫ్రాన్స్​ లాంటి పరిస్థితులు లేవని.. అలాంటి తీవ్రత తలెత్తితే దేశవ్యాప్తంగా పూర్తిస్థాయిలో లాక్​డౌన్​ విధిస్తామన్నారు.

Coronavirus: Pak PM rules out complete lockdown, says it will create chaos
'ఇటలీలాంటి పరిస్థితి వస్తే పాక్​లో పూర్తిస్థాయి లాక్​డౌన్​'​
author img

By

Published : Mar 23, 2020, 5:28 AM IST

Updated : Mar 23, 2020, 9:41 AM IST

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్థాన్​లో లాక్​డౌన్​ విధించలేమని స్పష్టం చేశారు ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్​ ఖాన్​. ఈ చర్యల వల్ల గందరగోళం నెలకొంటుందని, ప్రజలే స్పచ్ఛందంగా స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని కోరారు. దేశంలో 25 శాతం కన్నా ఎక్కువ మంది దారిద్య్ర రేఖకు దిగువన జీవిస్తున్నారని.. లాక్​డౌన్​ ద్వారా వారి జీవితాలు ఛిన్నాభిన్నం అవుతాయని తెలిపారు.

పాక్​లో కరోనా కారణంగా నలుగురు మరణించారు. 700మందికిపైగా ఈ మహమ్మారి బారినపడ్డారు. కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో నివారణ చర్యలపై పలు కీలక విషయాలు వెల్లడించారు ఇమ్రాన్​.

''దేశవ్యాప్తంగా లాక్​డౌన్ అంటే ఏమిటో ముందు తెలుసుకుందాం. కర్ఫ్యూ విధించి.. ప్రజలను వారి ఇళ్లలో బంధించడం. అలాంటి నిర్ణయాన్ని మేము స్వాగతించలేం. అది దేశంలో అశాంతి నెలకొనేలా చేస్తుంది. ఇటలీ, ఫ్రాన్స్​ దేశాలతో పోలిస్తే పాక్​లో పరిస్థితి మెరుగ్గానే ఉంది. ఒకవేళ ఇటలీ వంటి పరిస్థితులు తలెత్తితే పూర్తి లాక్​డౌన్​ విధిస్తాం.

-ఇమ్రాన్​ ఖాన్​, పాకిస్థాన్​ ప్రధాని

దేశంలోని పరిస్థితిని ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని, అందుకు అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని ఇమ్రాన్​ స్పష్టం చేశారు. దేశంలో అన్ని అంతర్జాతీయ విమానాలను రెండు వారాల పాటు నిలిపేసినట్లు పేర్కొన్నారు. రైలు సేవలను కూడా తగ్గించినట్లు తెలిపారు.

సింధ్​లోనే అత్యధికం..

పాక్​లోని సింధ్​ రాష్ట్రంలో పరిస్థితి తీవ్రంగా ఉంది. అత్యధిక కేసులు ఆ రాష్ట్రంలోనే నమోదయ్యాయి. అయితే ఈ విషయంపై ఆ రాష్ట్ర​ ముఖ్యమంత్రి సయ్యద్​ మురాద్​ అలీ షా ఆందోళన వ్యక్తం చేశారు. కరాచీ సహా రాష్ట్రమంతటా 15 రోజులు లాక్​డౌన్​ విధించటం తప్ప మరోదారి కనిపించడం లేదని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యమే ప్రాధాన్యమన్నారు

ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్​ను అరికట్టేందుకు సాయుధ బలగాలను మోహరించాలని బలూచిస్థాన్​, పంజాబ్​ ప్రభుత్వాలు అభ్యర్థించాయి.

Last Updated : Mar 23, 2020, 9:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.