ETV Bharat / international

జనాల మధ్యే కాదు.. ఎవరూలేని చోటా కరోనా! - Corona found on Apartments

కరోనా.. కరోనా.. కొన్ని నెలలుగా ఎవరి నోట విన్నా.. కరోనా మాటే.! అధిక జనసంద్రం మధ్యే కాదు, ఎవరూలేని చోట కూడా ఈ మహమ్మారి వ్యాప్తి చెందుతుందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అపార్ట్​మెంట్​లలో వాడకుండా ఉన్న బాత్రూమ్​లలో వైరస్​ ఆనవాళ్లు ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు. ఇంట్లో వాడకంలో లేని సింక్​, ట్యాప్​, షవర్​ హ్యాండిల్​ వంటివాటిపై మహమ్మారిని గుర్తించారు శాస్త్రవేత్తలు.

Coronavirus Found in Bathroom
జనాల మధ్యే కాదు.. ఎవరూలేని చోటా కరోనా!
author img

By

Published : Aug 29, 2020, 1:33 PM IST

Updated : Aug 29, 2020, 1:47 PM IST

వాడకుండా ఉన్న అపార్ట్‌మెంటులోని బాత్రూముల్లో వైరస్‌ ఆనవాళ్లను గుర్తించినట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. చాలాకాలంగా ఖాళీగా ఉన్న ఇంట్లోని సింక్‌, ట్యాప్‌, షవర్‌ హ్యాండిల్‌ పై వైరస్‌ను గుర్తించినట్లు చైనీస్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్‌కు చెందిన పరిశోధకులు వెల్లడించారు. ఈ విషయాన్ని బ్లూమ్‌బర్గ్‌ నివేదించింది.

అధ్యయనం ఏమంటోందంటే.?

అధ్యయనం ప్రకారం.. ఖాళీగా ఉన్న అపార్ట్‌మెంట్‌ కింద ఇంట్లో ఉండేవారు కరోనా వైరస్‌ బారిన పడ్డారు. ఆ తరవాత వారం రోజులకు ఖాళీగా ఉన్న ఇంట్లో వైరస్‌ ఆనవాళ్లను పరిశోధకులు గుర్తించారు. టాయిలెట్ ఫ్లష్ వేగానికి వైరస్‌ పైపుల ద్వారా ఆ ఇంట్లోకి చేరినట్లు 'యాన్‌ ఆన్‌సైట్‌ స్టిమ్యులేషన్ ఎక్స్‌పెరిమెంట్' ద్వారా శాస్త్రవేత్తలు గుర్తించారు.

వైరస్‌ సోకిన వ్యక్తి మలంలో వైరస్‌ తీవ్రత అధికంగా ఉంటుందని, ఇది ఇతర అపార్ట్‌మెంట్లకు చేరి, గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందని తెలిపారు. బాత్రూమ్‌ల వాడకం అత్యంత అవసరమని, అయితే.. వాటిని సరిగా వినియోగించకపోతే గాలి బిందువుల ద్వారా వైరస్‌ వ్యాపిస్తుందని వెల్లడించారు. ఆసుపత్రుల్లో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుందన్నారు. ప్లషింగ్ వల్ల ఇళ్లల్లో వైరస్‌ పైభాగానికి ప్రయాణించే అవకాశం ఉందని తెలిపారు. నీటి సదుపాయం సరిగా లేని దగ్గర కూడా ఇలాంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని వివరించారు.

ఇదీ చదవండి: మహిళల్లో కరోనా ప్రభావం తక్కువ.. కారణం అదే!

Last Updated : Aug 29, 2020, 1:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.