ప్రపంచదేశాల్లో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. కొత్తగా 2 లక్షల 77 వేల 770 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 5,992 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 2 కోట్ల 97 లక్షలు దాటింది. 9 లక్షల 38 వేల 447మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే 2 కోట్ల 15 లక్షల 30 వేలమందికిపైగా మహమ్మారి నుంచి కోలుకున్నారు.
- అమెరికాలో తాజాగా 36 వేల 447 కేసులు నమోదవగా... 1,197 మంది చనిపోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 67 లక్షల 88 దాటింది. కొవిడ్ మరణాల సంఖ్య 2 లక్షలు దాటింది.
- బ్రెజిల్లో కరోనా కేసుల సంఖ్య మంగళవారం తగ్గినట్లు కనిపించినా... మళ్లీ పెరిగింది. కొత్తగా 34 వేల 755 కేసులు వెలుగుచూశాయి. మరో 1,090 మంది మరణించారు.
దేశం | మొత్తం కేసులు | మొత్తం మరణాలు |
అమెరికా | 67,88,147 | 2,00,197 |
భారత్ | 50,18,034 | 82,091 |
బ్రెజిల్ | 43,84,299 | 1,33,207 |
రష్యా | 10,73,849 | 18,785 |
పెరూ | 7,38,020 | 30,927 |
ఇదీ చూడండి: నేపాల్లో భూకంపం-బిహార్లోనూ ప్రకంపనలు