ETV Bharat / international

కరోనా ప్రతాపంతో ప్రపంచదేశాలు ఉక్కిరిబిక్కిరి

author img

By

Published : Apr 24, 2020, 6:31 AM IST

ప్రపంచదేశాలపై కరోనా విరుచుకుపడుతూనే ఉంది. కేసులు, మరణాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఐరోపాలో తీవ్రంగా ఉన్నప్పటికీ.. కొద్ది రోజులుగా వ్యాప్తి తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. రష్యాలో కేసులు 60 వేలు దాటాయి. విదేశాల్లో భారత సంతతి వ్యక్తుల మరణాలు పెరిగిపోతున్నాయి.

Coronavirus death toll rises to 22,157 in Spain
కరోనా ప్రతాపంతో ప్రపంచదేశాలు ఉక్కిరిబిక్కిరి

కరోనా ధాటికి ప్రపంచ దేశాలు అతలాకుతలమవుతున్నాయి. ఇప్పటివరకు 27 లక్షల మందికిపైగా వైరస్​ బారినపడ్డారు. మరో లక్షా 90 వేల మంది మరణించారు. ప్రపంచవ్యాప్తంగా 7 లక్షల 40 వేల మందికిపైగా కోలుకున్నారు.

ఐరోపాలోనే కేసులు, మరణాలు అధికంగా ఉన్నాయి. ఇక్కడ ఆయా దేశాల్లో వైరస్​ వ్యాప్తి స్థిరంగా ఉండగా.. మరికొన్ని దేశాల్లో కేసులు అమాంతం పెరిగిపోతున్నాయి. స్పెయిన్​, ఇటలీల్లో మరణాల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది. బ్రిటన్​, ఫ్రాన్స్​లలో మృతుల సంఖ్య తగ్గింది. అమెరికాలో గడిచిన 24 గంటల్లో 3176 మంది మరణించినట్లు జాన్స్​ హాప్కిన్స్​ విశ్వవిద్యాలయం వెల్లడించింది.

స్పెయిన్​...

గురువారం మరో 440 మంది కరోనా కారణంగా చనిపోగా.. స్పెయిన్​లో మొత్తం మరణాల సంఖ్య 22 వేల 157కు చేరింది. మరో 4,600 మందికిపైగా వైరస్​ సోకింది.

అయితే.. దేశప్రజల్లో కొత్త భయాందోళనలు నెలకొన్నాయి. అధికారికంగా ప్రకటించిన దానికంటే బాధితులు, మరణాల సంఖ్య అధికంగా ఉండే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. లక్షణాలు లేకుండా కరోనా దాడి చేయొచ్చని ఆందోళన చెందుతున్నారు.

Coronavirus death toll rises to 22,157 in Spain
ప్రపంచదేశాల్లో కరోనా వివరాలు

ఇటలీ..

గడిచిన 24 గంటల్లో ఇటలీలో మరో 2 వేల 4 వందల మందికిపైగా వైరస్​ సోకింది. 40 శాతం పైగా లోంబార్డీ ప్రాంతంలోనే నమోదుకావడం గమనార్హం. మొత్తం కేసులు దాదాపు లక్షా 90 వేలు. గురువారం మరో 464 మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 25 వేల 549కి చేరింది.

ఫ్రాన్స్​లో మరో 516 మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 21 వేల 856కు చేరింది. ఐసీయూ బాధితుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

బ్రిటన్​ గురువారం మరో 638 మంది కొవిడ్​ ధాటికి ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ మొత్తం మృతుల సంఖ్య 18 వేల 738కి చేరింది.

బ్రెజిల్​లో తీవ్రం...

బ్రెజిల్​లో ఒక్కరోజే రికార్డు స్థాయిలో 407 మంది మరణించారు. కొత్తగా 3 వేల 735 మంది వైరస్​ బారినపడ్డారు. కేసులు 50 వేలకు సమీపంలో ఉన్నాయి. బెల్జియంలో గురువారం 228, కెనడాలో 167, నెదర్లాండ్స్​లో 123, మెక్సికోలో 113, స్వీడన్​లో 84 మంది ప్రాణాలు విడిచారు.

రష్యాలో మరో 42 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 62 వేలు దాటింది. ఇరాన్​లో గురువారం 90 మంది బలయ్యారు. టర్కీలో కేసులు లక్ష దాటాయి. గురువారం మరో 115 మంది మరణించారు.

సింగపూర్​లో..

సింగపూర్​లో కేసులు పెరిగిపోతున్నాయి. మరో 1037 మందికి వైరస్​ సోకగా.. విదేశీ కార్మికులే అధికసంఖ్యలో ఉన్నారు. గురువారం ఇక్కడ ఓ భారత సంతతి వ్యక్తి మరణించినట్లు తెలుస్తోంది. అయితే.. ఆ దేశంలో ఉన్న భారతీయులను సొంత వ్యక్తుల్లా చూసుకుంటామని మోదీకి హామీ ఇచ్చారు సింగపూర్​ ప్రధాని.

సౌదీలో 11 మంది భారతీయులు...

కరోనా కారణంగా సౌదీ అరేబియాలో 11 మంది భారత పౌరులు మరణించినట్లు.. రాయబార కార్యాలయం వెల్లడించింది. లాక్​డౌన్​ కారణంగా.. వీరిని తరలించే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అధికారులు స్పష్టం చేశారు.

పాక్​లో గురువారం మరో 981 మంది వైరస్​ బారినపడ్డారు. 23 మంది మృతి చెందగా.. మొత్తం బాధితుల సంఖ్య 11 వేలు దాటింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.