కరోనా సంక్షోభం తర్వాత చైనాలో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇటీవల లాక్డౌన్ ఎత్తివేసిన అక్కడి ప్రభుత్వం.. అనేక జాగ్రత్తలతో పాఠశాలలను పునఃప్రారంభించాలని యోచిస్తోంది. ఈ మేరకు విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య రక్షణ కోసం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. విద్యాసంస్థల్లో సమావేశాలు, క్రీడా కార్యక్రమాలు నిషేధించింది.
అంటువ్యాధులు నివారణ, నియంత్రణ దృష్టిలో ఉంచుకొని స్థానిక అవసరాలకు అనుగుణంగా క్రీడా శిక్షణలు, వ్యాయామ కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని విద్యా సంస్థలను ఆదేశించింది చైనా విద్యా శాఖ.
పాక్షికంగా తెరుచుకున్న విద్యా సంస్థలు
తూర్పు చైనాలో పాక్షికంగా విద్యా సంస్థలు తెరిచారు. 9.77 లక్షలమంది విద్యార్థులు హాజరైనట్లు సమాచారం. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని తెలియజేసే డిజిటల్ సంకేతాలు, శరీర ఉష్ణగ్రతలను తెలుసుకున్న తర్వాతే వారిని లోపలకు అనుమతించారు. బీజింగ్ నగర యంత్రాంగం కూడా క్రమంగా పాఠశాలను తెరవాలనే ఆలోచనలో ఉంది.
ఇదీ చూడండి: లాక్డౌన్ ఎత్తివేత ఒత్తిడిలో ప్రపంచ దేశాలు