ETV Bharat / international

ఇటలీలో కరోనా మరణమృదంగం.. బ్రిటన్​ ఆరోగ్య మంత్రికీ వైరస్​

author img

By

Published : Mar 11, 2020, 12:16 PM IST

ప్రపంచ దేశాల్లో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రధానంగా ఇటలీలో వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. మంగళవారం ఒక్కరోజే ఇటలీలో 168మంది మృతి చెందారు. చైనాలో వైరస్​ నియంత్రణలోనే ఉన్నట్లు తెలుస్తోంది. బ్రిటన్​, అమెరికా, టర్కీ సహా ఇతర దేశాల్లోనూ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బ్రిటన్​ ఆరోగ్య మంత్రికీ కరోనా సోకడం గమనార్హం. దక్షిణ కొరియాలో మాత్రం 5 రోజుల తర్వాత మళ్లీ కేసులు పెరిగాయి.

Coronavirus cases in Italy jump to over 8,500, death toll at 631
ఇటలీలో కరోనా మరణమృదంగం.. ఒక్కరోజే 168మంది బలి

చైనాలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మిగతా దేశాల్లో అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇటలీలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. మంగళవారం ఒక్కరోజే ఇటలీలో 168 మంది కరోనాతో మృతి చెందడం.. వైరస్​ తీవ్రతకు అద్దం పడుతుంది. తాజా మరణాలతో ఇటలీలో మృతుల సంఖ్య 631కు చేరుకుంది. ఇప్పటి వరకు 8,514మందికి వైరస్​ సోకినట్లు అధికారులు తెలిపారు.

చైనాలో అదుపులోనే పరిస్థితి..

చైనాలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. వైరస్​తో మంగళవారం 22మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 3,158కు పెరిగింది. చైనాలో ఇప్పటివరకు 80,778 మందికి కరోనా సోకింది. ప్రస్తుతం 16,145మంది వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.

కొరియాలో మళ్లీ...

కొద్ది రోజులుగా కేసులు తగ్గుతున్న దక్షిణ కొరియాలో 5 రోజులకు వైరస్​ బాధితులు పెరిగారు. మంగళవారం అక్కడ కొత్తగా 242 మందికి కరోనా సోకినట్లు తెలిపారు అధికారులు. మొత్తం బాధితుల సంఖ్య 7,755కు చేరింది. మరో 6 మరణాలతో మృతుల సంఖ్య 60కి పెరిగింది.

బ్రిటన్ ఆరోగ్య మంత్రికి కరోనా

బ్రిటన్ ఆరోగ్య శాఖ మంత్రి నాడిన్​ డోరీస్​కు కరోనా వైరస్​ సోకింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. వైరస్​ సోకడం వల్ల ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు పేర్కొన్నారు. బ్రిటన్​లో ఇప్పటివరకు 373మంది కరోనా బారిన పడ్డారు.

టర్కీలో తొలి కేసు.. పనామాలో తొలి మరణం

టర్కీలో తొలి కరోనా కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇటీవల ఐరోపా నుంచి వచ్చిన వ్యక్తికి వైరస్​ సోకినట్లు అధికారులు నిర్ధరించారు. ఈ నేపథ్యంలో విదేశాలకు ప్రయాణించవద్దని ఆ దేశ పౌరులకు సూచించారు ఆరోగ్య మంత్రి. శ్రీలంకలోనూ ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు సమాచారం. మధ్య అమెరికాలోని పనామాలో తొలి కరోనా మరణం సంభవించింది. పనామాలో ఇప్పటివరకు ఎనిమిది కేసులు నమోదయ్యాయి.

కరోనా 107 దేశాలకు విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 1,17,339 మంది వైరస్​ బారిన పడగా.. 4,251మంది మృతి చెందారు.

ఇదీ చూడండి: మాస్కులతో దర్శనమిస్తున్న దేవుళ్ల విగ్రహాలు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.