ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. తాజాగా బాధితుల సంఖ్య 3.03 కోట్లు దాటింది. ఇప్పటివరకు మొత్తం 9 లక్షల 50 వేల మందికి పైగా మృతి చెందారు. కరోనా నుంచి 2 కోట్ల 20 లక్షల మంది కోలుకున్నారు.
ప్రపంచ దేశాల్లో ఇదీ పరిస్థితి...
- అమెరికాలో కొత్తగా 46 వేలకుపైగా కరోనా కేసులు బయటపడ్డాయి. మరో 879 మంది మృతిచెందారు. అగ్రరాజ్యంలో మొత్తం 68 లక్షల 74 వేల మంది కరోనా బాధితులున్నారు. మొత్తం 2.02 లక్షల మందికి పైగా మరణించారు.
- బ్రెజిల్‌లో మరో 35 వేల మంది కరోనా బారిన పడ్డారు. తాజాగా 857 మంది ప్రాణాలు కోల్పోయారు.
- రష్యాలో 5,762 మందికి కొత్తగా కరోనా నిర్ధరణ అయ్యింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 10.85 లక్షలు దాటింది.
- పెరులో తాజాగా నమోదైన కేసులతో కలిపి మొత్తం 7 లక్షల 50 వేల మంది కరోనా బారినపడ్డారు.
- మెక్సికోలో 6 లక్షల 80 వేల మందికి కరోనా పాజిటివ్‌గా తేలగా... వీరిలో 4.85 లక్షల మంది కోలుకున్నారు. దాదాపు 72 వేల మంది మరణించారు.
- దక్షిణాఫ్రికాలో 6 లక్షల 55 వేల మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. దీంతో 15 వేల మందికిపైగా మరణించారు.
- స్పెయిన్‌లో కొత్తగా 11 వేల 291 కేసులను గుర్తించారు. మరో 162 మంది మరణించారు.
- మరోవైపు.. ఐరోపాలో కరోనా కేసులు తీవ్రస్థాయిలో పెరుగుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. దీంతో మహమ్మారి రెండో దశ విజృంభణను ఆపేందుకు ఐరోపా దేశాలు మళ్లీ లాక్‌డౌన్ విధించాలని భావిస్తున్నాయి. ఐరోపాలోని దాదాపు సగం దేశాల్లో గత రెండు వారాల్లో కేసులు 10 శాతం పెరిగాయని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.
- న్యూజిలాండ్‌లో తాజాగా ఒక్క కరోనా కేసు నమోదు కాలేదు. గత ఐదు వారాల్లో కేసు నమోదు కాని రోజు ఇదే కావటం విశేషం. ఆ దేశంలో ఇప్పటివరకు 1800 మంది కరోనా బారిన పడగా .. 25 మంది ప్రాణాలు విడిచారు.
దేశం | మొత్తం కేసులు | మొత్తం మరణాలు |
అమెరికా | 68,74,596 | 2,02,213 |
భారత్ | 52,14,678 | 84,370 |
బ్రెజిల్ | 44,57,443 | 1,35,031 |
రష్యా | 10,85,281 | 19,061 |
పెరు | 7,50,098 | 31,146 |