మానవుల్లోని అంతర్గత కొలెస్ట్రాల్ ప్రాసెసింగ్ వ్యవస్థను తెలివిగా ఉపయోగించుకోవడం ద్వారా శరీరంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోందని చైనా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఆవిష్కారం ఆధారంగా కరోనా మహమ్మారికి కొత్త చికిత్స మార్గాలను కనుగొనవచ్చని చెప్పారు. 'అకాడమీ ఆఫ్ మిలటరీ మెడికల్ సైన్సెస్' శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేపట్టారు.
కొలెస్ట్రాల్ జీవక్రియకు, కొవిడ్-19కు మధ్య సంబంధాన్ని ఇది బయట పెట్టింది. మానవ శరీరంలో హెచ్డీఎల్ కొలెస్ట్రాల్ ఉంటుంది. దీన్ని మంచి కొలెస్ట్రాల్ అని కూడా పిలుస్తారు. ఇన్ఫెక్షన్ కలిగించే సమయంలో కరోనా వైరస్.. మానవుల్లోని ఏసీఈ2 అనే రిసెప్టార్ ను ఉపయోగించుకుంటుంది.
'హెచ్డీఎల్ స్కావెంజర్ రిసెప్టార్ బి టైప్ 1' (ఎస్ఆర్-బీ1) అనే మరో రిసెప్టార్ పాత్రను చైనా శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. ఇది మానవుల ఊపిరితిత్తుల కణాలు సహా అనేక కణజాలాల్లో కనిపిస్తుంది. ఈ రిసెప్టార్.. హెడీఎల్ కొలెస్ట్రాల్‌కు అతుక్కుంటుంది. ఈ రిసెప్టారకు సంధానం కావడం ద్వారా కరోనా వైరస్.. కొలెస్ట్రాల్‌కు చేరుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు. అనంతరం అక్కడి వ్యవస్థను హైజాక్ చేస్తోందన్నారు. తద్వారా శరీరంలో వ్యాపిస్తోందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'పది నెలల్లోనే కరోనా టీకా సాధ్యమైందిలా'