కరోనా మహమ్మారి వ్యాప్తి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా బాధితుల సంఖ్య 2 కోట్ల 40 లక్షల 50వేల 731కి చేరింది. వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 8 లక్షల 23వేల 298కి పెరిగింది. దాదాపు కోటి 66 లక్షల మంది వ్యాధి బారినపడి కోలుకున్నారు.
అగ్రరాజ్యం అమెరికా, భారత్, బ్రెజిల్ దేశాల్లో కొత్త కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. అమెరికాలో బాధితుల సంఖ్య 60 లక్షలకు చేరువ కాగా.. మృతుల సంఖ్య లక్షా 82వేలు దాటింది.
కరోనా కేసులు అధికంగా ఉన్న దేశాలు..
దేశం | కేసులు | మరణాలు | |
1 | అమెరికా | 59,55,728 | 1,82,404 |
2 | బ్రెజిల్ | 36,74,176 | 1,16,666 |
3 | భారత్ | 31,67,324 | 58,390 |
4 | రష్యా | 9,66,189 | 16,568 |
5 | దక్షిణాఫ్రికా | 6,13,017 | 13,308 |
ఇదీ చూడండి: కరోనా నుంచి కోలుకున్నా.. మళ్లీ వస్తుంది జాగ్రత్త!