ETV Bharat / international

ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్లకు చేరువలో కేసులు - corona virus cases across world

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి గడగడలాడిస్తోంది. రోజూ లక్షలాది మంది వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య 2.50 కోట్లకు చేరువైంది. వైరస్ ధాటికి 8.36 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.

global cases
కరోనా మహమ్మారి
author img

By

Published : Aug 28, 2020, 7:16 PM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ అంతకంతకూ విజృంభిస్తోంది. పలు దేశాల్లో భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు 2.46 కోట్ల మందికి వైరస్ సోకగా.. 8.36 లక్షల మంది మృత్యువాత పడ్డారు. సుమారు 1.71 కోట్ల మంది కోలుకున్నారు.

3 దేశాల్లోనే..

అమెరికా, బ్రెజిల్​, భారత్​లో వైరస్​ ఉద్ధృతి కొనసాగుతోంది. ఈ 3 దేశాల్లో కలిపి రోజూ 1.5 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.

రష్యాలో వైరస్ వ్యాప్తి స్థిరంగా ఉంది. కొత్తగా 4,829 కేసులు నమోదు కాగా.. మొత్తం సంఖ్య 9.80 లక్షలకు చేరింది. మరణాల సంఖ్య 17 వేలకు చేరువైంది.

పలు దేశాల్లో ఇలా..

  • పొరుగు దేశం నేపాల్​లో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కొత్తగా 927 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఆ దేశంలో 36 వేల మంది వైరస్ బారిన పడ్డారు.
  • పాకిస్థాన్​లో మరో 415 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరించారు. దేశవ్యాప్తంగా 2.95 లక్షల కరోనా కేసులు ఉన్నాయి.
  • సింగపూర్​లో శుక్రవారం 94 కేసులు నమోదయ్యాయి. ఇందులో 10 మంది విదేశాల నుంచి వచ్చినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు సింగపూర్​లో 56 వేల మందికి వైరస్ సోకింది.
  • మెక్సికో, ఫిలిప్పీన్స్, ఇండోనేసియా​లోనూ రోజూ 3 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.
దేశం కేసులుమరణాలు కోలుకున్నవారు
అమెరికా 60,49,440 1,84,927 33,48,784
బ్రెజిల్ 37,64,493 1,18,726 29,47,250
భారత్​ 33,92,367 61,725 25,85,037
రష్యా 9,80,405 16,914 7,98,466
పెరూ 6,21,997 28,277 4,29,662
దక్షిణాఫ్రికా 6,18,286 13,628 5,31,338
కొలంబియా 5,82,022 18,468 4,17,793
మెక్సికో 5,79,914 62,594 4,00,479

ఇదీ చూడండి: 'ఉద్రిక్తతలు పెంచేందుకే చైనా క్షిపణి ప్రయోగాలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.