ETV Bharat / international

ప్రపంచవ్యాప్తంగా 57 లక్షలకు చేరువలో కరోనా కేసులు - mexico corona news

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 56,89,212కు చేరింది. మహమ్మారి కారణంగా మరణించిన వారి సంఖ్య 3,52,294కు పెరిగింది. చైనాలో 28 మందికి కొత్తగా వైరస్​ సోకింది. వారిలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడం కలవరానికి గురి చేస్తోంది.

corona cases across the globe near to 5 million
ప్రపంచవ్యాప్తంగా 57 లక్షలకు చేరువైన కరోనా కేసులు
author img

By

Published : May 27, 2020, 1:45 PM IST

కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా అంతకంతకూ విజృంభిస్తోంది. మొత్తం కేసుల సంఖ్య 56లక్షల 89వేల 212కు చేరింది. ఇప్పటి వరకు 3లక్షల 52వేల 294 మంది ప్రాణాలు కోల్పోయారు. 24లక్షల 32 వేల 271 మంది వైరస్​ బారి నుంచి కోలుకున్నారు. వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న అగ్రరాజ్యం అమెరికాలో కేసుల సంఖ్య 17లక్షల 25వేలు దాటగా, లక్ష మందికి పైగా చనిపోయారు.

చైనాలో కొత్తకేసులు..

చైనాలో కొత్తగా 28మందికి కరోనా సోకింది. వీరిలో వైరస్ లక్షణాలేమీ కనపించక పోవడం ఆ దేశాన్ని కలవరానికి గురి చేస్తోంది. కొత్త కేసుల్లో ఎక్కువగా వైరస్​ కేంద్ర బిందువైన వుహాన్​ నుంచే నమోదైనట్లు వైద్య అధికారులు తెలిపారు. ఈ తరహా కేసులు రాష్ట్రంలో ఇప్పటి వరకు 332 నమోదయ్యాయి.

దక్షిణ కొరియాలో 40 కేసులు..

కరోనా ప్రభావం తగ్గిందని భావిస్తున్న దక్షిణ కొరియాలో ఒక్క రోజే 40 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. గత 50 రోజుల్లో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. పాఠశాలలు బుధవారం నుంచి ప్రారంభమైన నేపథ్యంలో కేసుల సంఖ్య పెరగడం ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది.

పాక్​లో 1446 కొత్త కేసులు

పాకిస్థాన్​లో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. 24 గంటల్లో 1,446 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 59వేలు దాటింది. మృతుల సంఖ్య 1,225కు పెరిగింది.

మెక్సికోలో 500కు పైగా మరణాలు..

మెక్సికోలో ఒక్క రోజులోనే 501 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల్లో ఇంత మంది మరణించడం ఇదే తొలిసారి. కొత్తగా నమోదైన 3,455 కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 74,560కి చేరింది.

రష్యాలో 101మంది వైద్య సిబ్బంది మృతి..

కరోనా సోకి రష్యాలో ఇప్పటి వరకు 101మంది వైద్య సిబ్బంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ సంఖ్య 300కు పైనే ఉంటుందని ఆరోగ్య కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

3,60,000కుపైగా పాజిటివ్​ కేసులతో ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది రష్యా. అక్కడ ఇప్పటి వరకు 3,807 మంది ప్రాణాలు కోల్పోయారు.

జూన్ 1నుంచి ప్రార్థనా మందిరాలు ఓపెన్​

ప్రార్థనా మందిరాలు, మతపరమైన సంస్థలను జూన్ 1నుంచి పునఃప్రారంభించనున్నట్లు దక్షిణాఫ్రికా తెలిపింది. ఆంక్షలు మాత్రం కఠినంగా ఉంటాయని స్పష్టం చేసింది. ఆ దేశంలో ఇప్పటి వరకు 23,615 కేసులు నమోదు కాగా, 481మంది మరణించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.