ETV Bharat / international

కూలిన విమాన శకలాలు గుర్తింపు- 28 మంది మృతి! - RUSSIA PLANE WRECKAGE

russia plane
రష్యా విమాన ప్రమాదం
author img

By

Published : Jul 6, 2021, 11:17 AM IST

Updated : Jul 6, 2021, 5:35 PM IST

16:22 July 06

రష్యాలో కంట్రోల్ రూంతో సంబంధాలు కోల్పోయి గల్లంతైన విమానం సముద్రంలో కుప్పకూలింది. తీర ప్రాంతంలో విమాన శకలాలు లభ్యమయ్యాయి. ఓఖోట్​స్క్ ఎయిర్​పోర్ట్​కు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండగా విమానం.. సిగ్నల్ కోల్పోయింది. దీంతో విమానం పడిపోయిందని భావించిన ప్రదేశంలో తనిఖీలు చేపట్టారు. ప్రమాద సమయంలో విమానంలో 28 మంది ఉన్నారు.

కాగా.. ఈ విమాన ప్రధాన భాగం సముద్ర తీర ప్రాంతంలో కనిపించిందని కమ్​చాట్కా రాష్ట్ర గవర్నర్ వ్లాదిమిర్ సోలోదోవ్ తెలిపారు. ఈ ప్రదేశానికి కొద్ది దూరంలో మరికొన్ని శకలాలు కనిపించాయని చెప్పారు. విమానంలో ఉన్న 28 మందిలో ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదని స్థానిక మీడియా పేర్కొంది. నౌకలు, విమానాలను ఉపయోగించి సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపింది.

వాతావరణ ప్రతికూలత!

మరోవైపు, ఈ ఘటనపై ఇప్పటికే రష్యా అధికారులు విచారణకు ఆదేశించారు. భద్రతా ఉల్లంఘనలు ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ల్యాండింగ్ సమయంలో వాతావరణం మేఘావృతమై ఉందని, పైలట్​కు పరిసరాలు సరిగ్గా కనిపించకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు తెలిపారు. 

పెట్రోపవ్లోస్క్‌- కామ్‌చట్‌స్కీ నుంచి పలానా వెళ్తున్న ఈ విమానం.. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్​తో సంబంధాలు కోల్పోయింది. దీంతో షెడ్యూల్‌ ప్రకారం ల్యాండింగ్‌ జరగలేదు. అప్రమత్తమైన అధికారులు విమానం కోసం గాలింపు చేపట్టారు. ఘటన సమయంలో విమానంలో 22 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ప్రయాణికుల్లో కొందరు చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 

11:13 July 06

రష్యా నుంచి బయలుదేరిన విమానం

విమానం మిస్సింగ్​..

రష్యాలోని ఓ ప్రయాణికుల విమానం గల్లంతైంది. ఫార్‌ ఈస్ట్‌ ప్రాంతంలో పెట్రోపవ్లోస్క్‌- కామ్‌చట్‌స్కీ నుంచి పలానా వెళ్తున్న ఓ విమానంతో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ సంబంధాలు తెగిపోయాయి. షెడ్యూల్‌ ప్రకారం ల్యాండింగ్‌ కూడా జరగలేదు. దీంతో అప్రమత్తమైన అధికారులు విమానం కోసం గాలిస్తున్నారు. ఘటన సమయంలో విమానంలో 22 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ప్రయాణికుల్లో కొందరు చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 

విమానం సముద్రంలో పడిపోయిందేమోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లేదా పలానా పట్టణం సమీపంలోని ఓ బొగ్గు గని ప్రాంతంలో కూలిపోయి ఉండొచ్చని స్థానిక కథనాలు పేర్కొంటున్నాయి. విమానం ఆచూకీ కనిపెట్టేందుకు రెండు హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్న ప్రాంతాలకు సహాయక సిబ్బంది బయల్దేరారు.

Last Updated : Jul 6, 2021, 5:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.