ETV Bharat / international

అరుణాచల్ మాదే.. అందుకే నిర్మాణాలు: చైనా

అరుణాచల్​ ప్రదేశ్​లో చైనా నిర్మిస్తున్న కొత్త గ్రామం తమ దేశ భూభాగంలోనే నిర్మిస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి చెప్పుకొచ్చారు.

Construction in 'our own territory' normal, says China on report of building village in Arunachal
అరుణాచల్ మాదే.. అందుకే నిర్మాణాలు: చైనా
author img

By

Published : Jan 21, 2021, 4:55 PM IST

Updated : Jan 21, 2021, 5:17 PM IST

అరుణాచల్​ ప్రదేశ్​లో నిర్మిస్తున్న నూతన గ్రామంపై వచ్చిన వార్తలపై చైనా స్పందించింది. తమ భూభాగంలో అభివృద్ధి, నిర్మాణ కార్యకలాపాలు జరగడం సర్వసాధారణం అంటూ చైనా విదేశాంగ మంత్రి హువా చునైంగ్​ చెప్పుకొచ్చారు.

'జాంగ్నాన్​ ప్రాంతంపై (దక్షిణ టిబెట్) చైనాకు స్పష్టత ఉంది. అరుణాచల్​ ప్రదేశ్​ను ఎప్పుడూ గుర్తించం. చైనా తన సొంత భూభాగంలో అభివృద్ధి, నిర్మాణ కార్యకలాపాలను నిరంతరం చేపడుతుంది. ఇది మా భూభాగంలోనే ఉంది. అందుకే ఆరోపణలకు తావులేదు' అని చునైంగ్​ పేర్కొన్నారు.

భారత్​ ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన అరుణాచల్ ప్రదేశ్​.. దక్షిణ టిబెట్​లో భాగమంటూ చైనా వాదిస్తుంది. అభివృద్ధి పనుల పేరిట సరిహద్దుల్లో కొన్ని నిర్మాణాలు చేపడుతోంది.

అరుణాచల్ ప్రదేశ్​లోని ఓ ప్రాంతంలో చైనా నూతన గ్రామం నిర్మిస్తున్నట్లు ఎన్​డీటీవీ గతంలో రెండు ఫొటోలను విడుదల చేసింది. మొదటి చిత్రంలో 101 ఇళ్లు నిర్మాణం ఉన్నట్లు ఉంది. అయితే మనుషులేవరు కనిపించలేదు. రెండో చిత్రంలో ఓ వరుసలో నిర్మాణం జరుగుతున్నట్లు కనిపించింది.

వీటిపై స్పందించిన భారత్​.. దేశ భద్రత, ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారానికి ఎటువంటి హాని కలగకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది.

ఇదీ చూడండి: బైడెన్​ స్పీచ్​ రైటర్​ వినయ్​పై ప్రశంసల జల్లు

Last Updated : Jan 21, 2021, 5:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.