ETV Bharat / international

కరోనా పంజా: కొలంబియాలో 7.5 లక్షలు దాటిన కేసులు - కొవిడ్​ వార్తలు

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 3 కోట్ల 7 లక్షలు దాటింది. ఇప్పటివరకు 9 లక్షల 57 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. భారత్​ సహా అమెరికా, రష్యా, బ్రెజిల్​, మెక్సికోలో వైరస్​ ప్రభావం తీవ్రంగా ఉంది. కొలంబియాలో కరోనా కేసులు 7 లక్షల 50 వేలు దాటాయి.

Colombia's COVID-19 tally surpasses 750,000
కరోనా పంజా: కొలంబియాలో 7.5 లక్షలు దాటిన కేసులు
author img

By

Published : Sep 19, 2020, 7:54 PM IST

కరోనాతో ప్రపంచ దేశాలు అతలాకుతలమవుతున్నాయి. వైరస్​ వ్యాప్తి ఏ మాత్రం తగ్గడం లేదు. పలు దేశాల్లో కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి. లండన్​లో​ రెండో దశ లాక్​డౌన్​ దిశగా ఆలోచిస్తుంది బోరిస్​ జాన్సన్​ ప్రభుత్వం. దేశంలో శుక్రవారం 4,322 మందికి వైరస్​ సోకింది.

రష్యాలో రోజూ 6 వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇవాళ మరో 6 వేల 65 మందికి వైరస్​ సోకగా.. మొత్తం బాధితుల సంఖ్య 11 లక్షలు దాటింది.

కొలంబియాలో కరోనా కేసులు 7 లక్షల 50 వేల మార్కు దాటింది. ఒక్కరోజే 6,526 మంది వైరస్​ బారినపడ్డారు. మొత్తం మరణాల సంఖ్య 23 వేల 850కి చేరింది.

  • మెక్సికోలో మరో 4,841 కేసులు, 624 మరణాలు నమోదయ్యాయి.
  • ఇరాన్​, ఫిలిప్పీన్స్​, ఇండోనేసియాలో రోజూ 100కుపైగా మరణాలు నమోదవుతున్నాయి.
  • నేపాల్​లో కరోనా కేసుల సంఖ్య 62 వేల 797కి చేరింది. ఒక్కరోజే 1204 కొత్త కేసులు వెలుగుచూశాయి. మరో 11 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 401కి చేరింది.
  • పాక్​లో వైరస్​ వ్యాప్తి క్రమంగా తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. శనివారం వచ్చిన 645 కొత్త కేసులతో కలిపి మొత్తం బాధితుల సంఖ్య 3,05,031కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 6,451కి చేరింది.
  • సింగపూర్​లో 15 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులు 57 వేల 558కి చేరాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.