ETV Bharat / international

మంచువర్షం.. కార్లలోనే ఇరుక్కుపోయి 21 మంది మృతి - చలికి తట్టుకోలేక 16 మంది మృతి పాకిస్థాన్​లో

Pakistan Snow Deaths: భారీ మంచువర్షం కారణంగా వాహనాల్లో ఇరుక్కుని 21 మంది మృతిచెందారు. ఇందులో 9 మంది చిన్నారులు కూడా ఉన్నారు. ఈ విషాద ఘటన పాకిస్థాన్​లో జరిగింది.

Cold kills 16 stuck in cars
చలికి కార్లలో ఇరుక్కుని 16 మంది మృతి
author img

By

Published : Jan 8, 2022, 3:36 PM IST

Updated : Jan 8, 2022, 6:34 PM IST

Pakistan Snow Deaths: హిమపాతం మధ్య కొండప్రాంతాల్లో ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదించేందుకు వెళ్లి.. కానరాని లోకాలకు వెళ్లారు కొంతమంది పర్యటకులు. చలికి తట్టుకోలేక, వాహనాల్లోనే ఇరుక్కుని 21 మంది మృత్యువాత పడ్డారు. ఇందులో 9 మంది చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఘటన పాకిస్థాన్​లో జరిగింది.

ఏమైందంటే..?

పాకిస్థాన్​, ఇస్లామాబాద్​కు 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముర్రీ ప్రాంతం ప్రకృతి అందాలకు పెట్టిందిపేరు. అందుకే శీతాకాలంలో హిమపాతం నడుమ ఈ అందాలను ఆస్వాదించేందుకు వేల సంఖ్యలో పర్యటకులు వస్తుంటారు.

ఈ ప్రాంతంలో శనివారం ఉష్ణోగ్రతలు మైనస్​ 8 డిగ్రీలకు పడిపోయాయి. మంచు భారీగా కురుస్తోంది. ఈ క్రమంలో పర్యటకులు కార్లలోనే ఇరుక్కుపోయారు. కార్లు మొత్తం మంచుతో నిండిపోయాయి. బయటకు వచ్చే పరిస్థితి లేదు. పర్యటకుల శరీర ఉష్ణోగ్రతలు తగ్గిపోయి (హైపోథెర్మియా) 21 మంది మృతిచెందారు.

మృతుల్లో ఇస్లామాబాద్​కు చెందిన ఓ పోలీస్ అధికారి కూడా ఉన్నారు. అంతేకాక మృతిచెందిన వారిలో 8 మంది ఆ పోలీస్​ అధికారి బంధువులే.

ఇప్పటికే వేల వాహనాలను మంచులోంచి బయటకు తీశామని.. ఇంకా కొన్ని తీస్తున్నామని స్థానిక మంత్రి షేక్ రషీద్ అహ్మద్​ తెలిపారు. ఒక్కరాత్రిలోనే ముర్రీ ప్రాంతాన్ని 4 అడుగుల మేర మంచుదుప్పటి కప్పేసిందన్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో రాకపోకలను నిషేధించగా.. సహాయక చర్యలకోసం భద్రతా బలగాలను మోహరించినట్లు పేర్కొన్నారు.

మరోవైపు కార్లలో ఇరుక్కుని మృతిచెందిన వారి వివరాలు తెలియాల్సి ఉందని, ఇలానే వాహనాల్లో ఇరుక్కున్న మరికొంతమందికి ఆహారం, దుప్పట్లను పంపిణీ చేస్తున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.

  • وزیراعلیٰ @UsmanAKBuzdar کا مری میں ایمرجنسی کےنفاذ کا اعلان: مری کو آفت زدہ قراردےدیا

    •مری اور ملحقہ علاقوں میں تمام ریسٹ ہاؤسز اور سرکاری اداروں کوسیاحوں کیلئےکھول دیاگیاہے
    •وزیراعلی نےاپنا ہیلی کاپٹر بھی ریسکیوسرگرمیوں کےلئےدےدیاموسم بہترہوتے ہی امدادی سرگرمیوں میں حصہ لےگا pic.twitter.com/o5sdTH8lD8

    — Government of Punjab (@GovtofPunjabPK) January 8, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 27లక్షల కరోనా కేసులు.. అమెరికాలో ఆగని ఉద్ధృతి

Last Updated : Jan 8, 2022, 6:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.