ETV Bharat / international

చైనాలో కరోనా కలవరం... పర్యటక ప్రాంతాలు బంద్! - చైనాలో కరోనా కేసులు

కరోనా వైరస్ విజృంభణతో (China Covid 19 news) పర్యటక ప్రాంతాలను మూసేస్తూ చైనాలోని ఓ రాష్ట్రం నిర్ణయం తీసుకుంది. బౌద్ధ మందిరాలు, ప్రార్థనా స్థలాలకు ప్రసిద్ధి చెందిన గాన్సు రాష్ట్రంలో కొత్తగా వైరస్ కేసులు (China Corona cases live) వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఈ మేరకు ఆంక్షలు (China Covid Restrictions) విధించింది అక్కడి ప్రభుత్వం.

china covid cases
చైనా కరోనా వైరస్ వార్తలు
author img

By

Published : Oct 25, 2021, 11:50 AM IST

చైనాలో కరోనా వైరస్ (China Covid 19 news) పడగవిప్పుతోంది. ఇప్పటికే వైరస్​ను నియంత్రించేందుకు అనేక ఆంక్షలను అమలు చేస్తున్న డ్రాగన్.. తాజాగా ఓ రాష్ట్రంలో పర్యటక ప్రాంతాలను మూసేసింది. కొత్త కేసులు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో గాన్సు రాష్ట్రంలోని బౌద్ధ మందిరాలు, ప్రఖ్యాత ప్రార్థనా స్థలాలను మూసేసింది.

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 35 కొత్త కేసులు (China Corona cases live) వెలుగులోకి వచ్చినట్లు జాతీయ వైద్య కమిషన్ వెల్లడించింది. ఇందులో నాలుగు గాన్సు నుంచే ఉన్నట్లు తెలిపింది. 19 కేసులు (China Covid 19 news) ఇన్నర్ మంగోలియాలో వెలుగుచూసినట్లు పేర్కొంది. దీంతో ఇన్నర్ మంగోలియాలోని ప్రజలను ఇళ్లలోనే ఉండాలని ఆదేశించింది.

కఠినంగా నియంత్రణ

స్థానికంగా పరిమిత సంఖ్యలోనే కేసులు వెలుగులోకి వచ్చినప్పటికీ.. కరోనా కట్టడిలో చైనా కఠిన వైఖరినే అవలంబిస్తోంది. లాక్​డౌన్లు విధించడమే కాకుండా క్వారంటైన్​లు, పరీక్షలను (China Covid Restrictions) తప్పనిసరి చేస్తోంది.

చైనాకు వస్తున్న ప్రయాణికుల్లో డెల్టా కేసులు (China Covid Delta) బయటపడటం అక్కడి అధికారుల్లో ఆందోళనకు కారణమవుతోంది. ఫిబ్రవరిలో వింటర్ ఒలింపిక్స్ జరగనున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.