ETV Bharat / international

అమ్మడం కోసమే పిల్లల్ని కన్న తండ్రి- రూ.31లక్షలకు ఐదుగురు! - చైనా అప్డేట్స్​

Chinese man sold his children: ఐదుగురు పిల్లలను రూ.లక్షలకు విక్రయించిన ఓ తండ్రికి 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది చైనా కోర్టు. కేవలం డబ్బు ఆశతో లాభాపేక్ష కోసమే ఈ దంపతులు పిల్లల్ని కన్నట్లు తెలిపింది. పసికందులను పెంచి పెద్ద చేయాల్సిన సొంత తల్లిదండ్రులే ఇలా చేయడం హేయమైన చర్య అని వ్యాఖ్యానించింది.

chinese man, పిల్లల్ని అమ్మేసిన తండ్రి
ఐదుగురు పిల్లల్ని రూ.లక్షలకు అమ్మేసిన తండ్రి
author img

By

Published : Dec 16, 2021, 7:05 PM IST

Chinese man sold his children: చైనా హెబే రాష్ట్రంలో ఓ వ్యక్తి డబ్బు కోసం సొంత బిడ్డలనే విక్రయించాడు. ఐదుగురు పిల్లలను 28,275డాలర్లకు(రూ.31 లక్షలు) ఇతరులకు అమ్మేశాడు. విచారణ అనంతరం యూ కౌంటీ కోర్టు ఇతనికి 10ఏళ్ల జైలు శిక్ష విధించింది. పిల్లలను అమ్మేందుకు సహకరించిన మరో ఇద్దరికి కూడా శిక్ష ఖరారు చేసింది.

కోర్టు తెలిపివ వివరాల ప్రకారం ఈ వ్యక్తి పేరు యాంగ్​. అతని భార్య పేరు యువాన్​. 2012-2020 మధ్య ఈ దంపతులు ముగ్గురు కూతుర్లు, ఇద్దరు కుమారులను అమ్మేశారు. ఒక్కొక్క బిడ్డను రూ.2 లక్షల నుంచి రూ.9లక్షల మధ్య ధరకు విక్రయించారు. నలుగురు పిల్లలను అమ్మేందుకు లీ అనే వ్యక్తి మధ్యవర్తిగా వ్యవహరించాడు. అందుకు అతనికి రూ.35వేలకుపైగా ఇచ్చారు. మరో మగబిడ్డను పుట్టిన వెంటనే ఆస్పత్రిలో పక్క బెడ్​లో ఉన్న మహిళకు విక్రయించారు యాంగ్​, యువాన్ దంపతులు.

ఈ నేరంలో మధ్యవర్తిగా ఉన్న లీ, అతని కోడలు డువాన్​ను కూడా దోషులుగా తేల్చింది న్యాయస్థానం. లీకి ఏడేళ్లు, డువాన్​కు 21నెలల జైలు శిక్ష ఖరారు చేసింది.

సొంత తల్లిదండ్రులే తమ బిడ్డల్ని విక్రయించండం అత్యంత హేయమైన చర్య అని కోర్టు వ్యాఖ్యానించింది. పిల్లల్లి ప్రేమతో పెంచి పెద్ద చేయాల్సిన వారే వాళ్లని వ్యాపార సాధనంగా చూశారని మండిపడింది. కేవలం డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతోనే వీరు పిల్లల్లి కన్నారు తప్ప మరో కారణం లేదని తేల్చి చెప్పింది. ఇలా చేయడం మైనర్ల హక్కులను కాలరాయడమే గాక, అక్రమ వ్యాపారాన్ని ప్రోత్సహించినట్లవుతుందని పేర్కొంది.

China news

చైనాలో 1980, 1990లలో పిల్లల అక్రమ రవాణా నేరాలు అధికంగా ఉండేవని 'ది సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్'​ నివేదిక తెలిపింది. ప్రభుత్వం అప్పట్లో 'ఒక్కరే ముద్దు- అసలే వద్దు' అనే పాలసీని తీసుకువచ్చిన తర్వాత కూడా ఇలాంటి నేరాలు జరుగుతూనే ఉన్నాయని పేర్కొంది. చైనా ప్రజా భద్రత వివరాల ప్రకారం పిల్లల అహహరణ కేసులు 2012లో 6,000గా ఉండగా.. 2021 నాటికి ఆ సంఖ్య 666కి తగ్గినట్లు ది సౌత్ చైనా మార్నింగ్​ పోస్ట్​ వెల్లడించింది.

China children trafficking

చైనాలో డబ్బుల కోసం పిల్లలను తల్లిదండ్రులు అమ్మేసే షాకింగ్ ఘటనలు తరచూ జరుగుతూనే ఉంటాయి. ఈ ఏడాది మే నెలలో దక్షిణ జెజియాంగ్ రాష్ట్రంలో జీ అనే ఓ వ్యక్తి విదేశీ పర్యటన కోసం తన రెండేళ్ల కుమారుడ్ని రూ.15లక్షలకు అమ్మేశాడు.

ఇవీ చదవండి: ఆడుకుంటుండగా విషాదం.. ఈదురు గాలులకు ఐదుగురు పిల్లలు బలి

ఇకపై ఆయాలు, పని మనుషులకూ వేతన సెలవులు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.