ETV Bharat / international

'ఆ టీకాతో పిల్లలకు కరోనా నుంచి రక్షణ!' - corona news

చిన్నారుల్లో కరోనావాక్ టీకా​ సురక్షితం, ప్రభావవంతమని ఓ అధ్యయనంలో తేలింది. రెండు టీకా డోసులు వేసుకున్న 3-17 ఏళ్ల వయస్సు గల చిన్నారుల్లో యాంటీబాడీలు సమృద్ధిగా ఉత్పత్తి అయినట్లు వెల్లడైంది. టీకా వేసుకున్న చోట కొద్దిపాటి నొప్పి మినహా ప్రతికూల అంశాలు లేవని తెలిసింది.

chinese tika
కరోనావాక్
author img

By

Published : Jun 29, 2021, 4:14 PM IST

పిల్లలకు టీకా అంశంపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో చైనా కరోనా వ్యాక్సిన్​ 'కరోనావాక్'​ చిన్నారులకు సురక్షితమైనదిగా తేలినట్లు లాన్సెట్ జర్నల్ ఓ కథనం ప్రచురించింది. కరోనావాక్ రెండు డోసులు వేసుకున్న 3-17 ఏళ్ల చిన్నారుల్లో యాంటీబాడీలు సమృద్ధిగా ఉత్పత్తి అయినట్లు తెలిపింది. జాన్​హువాంగ్​లోని 550 మంది పిల్లలపై కరోనావాక్​ను వైద్యులు పరీక్షించినట్లు వెల్లడించింది.

సైడ్ ఎఫెక్ట్స్​...

టీకా వేసుకున్న ప్రదేశంలో కొద్దిపాటి నొప్పి మినహా ప్రతికూలతలు లేవని ఈ అధ్యయనంలో తేలింది. మొదటి దశలో 72 మందికి, రెండో దశలో 480 మంది చిన్నారులకు టీకా వేశారు. టీకా డోసును 1.5 మైక్రోగ్రాములు, 3 మైక్రోగ్రాములుగా పిల్లలను రెండు బృందాలుగా విభజించారు. 1.5 మైక్రోగ్రాముల డోసును వేసిన పిల్లల్లో 26 శాతం మందిలో సైడ్ ఎఫెక్ట్స్​ రాగా.. 3 మైక్రోగ్రాముల బృందం చిన్నారుల్లో 29 శాతం మందిలో కొద్దిపాటి అస్వస్థత కనిపించింది. నిమోనియో ఉన్న ఒక చిన్నారిలో తీవ్ర ప్రతికూలతలు కనిపించాయి.

యాంటీబాడీలు ఇలా..

మొదటి దశలో చిన్నారులందరిలో యాంటీబాడీలు గణనీయంగా ఉత్పత్తి అయ్యాయి. రెండో డోసు తీసుకున్న తర్వాత 3 మైక్రో గ్రాముల డోసు తీసుకున్నవారందరిలో యాంటీబాడీలు ఉత్పత్తి కాగా.. 1.5 మైక్రోగ్రామ్ డోసు తీసుకున్న 97 శాతం మందిలో యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయి. 3 మైక్రోగ్రాముల డోసు తీసుకున్నవారిలో, 1.5 మైక్రోగ్రామ్ వేసుకున్న వారికన్నా బలమైన యాంటీబాడీలు ఉత్పత్తి అయినట్లు వైద్యులు గుర్తించారు.

3-17 ఏళ్ల పిల్లల్లో కన్నా 18 ఏళ్లు పైనున్న వారిలో ఇంకా ఎక్కువ యాంటీబాడీలు ఉత్పత్తి అయినట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అయితే.. మరింత మంది చిన్నారులపై టీకాను ప్రయోగించాల్సి ఉందని అభిప్రాయపడుతున్నారు. ఉత్పత్తి అయిన యాంటీబాడీలు చిరకాలం ఉంటాయన్న దానిపై ఎలాంటి స్పష్టత లేకున్నా.. కనీసం ఒక సంవత్సరం ఉంటాయని చెబుతున్నారు.

ఇదీ చదవండి:రెండు వేర్వేరు టీకాలు మిక్స్​ చేస్తే ఏమవుతుంది?

Corona: కరోనా భయం.. బయటపడేదెలా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.