'సింగిల్స్ డే'లో భాగంగా నవంబరు 1నుంచి 11వరకు ఆలీబాబా సంస్థ నిర్వహించిన షాపింగ్ బొనాంజాలో 498 బిలియన్ యువాన్లకు పైగా అమ్మకాలు నమోదు చేసి రికార్డు సృష్టించింది. నవంబరు 11న ఒక్కరోజే గత సంవత్సర రికార్డు 38.4బిలియన్ డాలర్లను దాటివేసింది. కరోనా కారణంగా దెబ్బతిన్న వ్యాపారులకు ఊరట కలిగిస్తూ ఈసారి సేల్స్ తేదీల గడువును పెంచింది ఆలీబాబా సంస్థ.
మరో రిటైల్ వ్యాపార సంస్థ జేడీ.కమ్ నిర్వహించిన షాపింగ్ బొనాంజాలో 271.5బిలియన్ యువాన్ల అమ్మకాలు నమోదయ్యాయి. సింగిల్స్ డే షాపింగ్ ఉత్సవాన్ని చైనాలో ఏటా నిర్వహిస్తారు. ఇందులో ప్రతి వస్తువూ తక్కువ ధరకే లభ్యమవుతుంది.