ETV Bharat / international

చైనా హై జంప్- క్యూ1లో 18.3% వృద్ధి రేటు!

కరోనా వల్ల ఏర్పడిన ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రపంచ దేశాలు సర్వ శక్తులు ఉపయోగిస్తున్నాయి. అయినప్పటికీ వృద్ధి అవకాశాలు స్వల్పంగానే ఉన్నాయి. చైనాలో పరిస్థితి ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో చైనా వృద్ధి రేటు 18.3 శాతంగా నమోదవడమే ఇందుకు ఉదాహరణ.

China Economic growth
చైనా ఆర్థిక వృద్ధి
author img

By

Published : Apr 16, 2021, 12:06 PM IST

చైనా ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు కళ్లు మిరిమిట్లు గొలిపేలా ఉంది. 2021 తొలి త్రైమాసికంలో (గతేడాది ఇదే త్రైమాసికంతో పోల్చుకొంటే) 18.3 శాతం వృద్ధి రేటును సాధించింది. 1992లో చైనా త్రైమాసిక వృద్ధిరేటును గణించడం మొదలుపెట్టినప్పటి నుంచి ఇదే అతిపెద్ద వృద్ధిరేటు. వాస్తవానికి రాయిటర్స్ సంస్థ నిర్వహించిన అభిప్రాయసేకరణలో ఆర్థికవేత్తలు ఇది 19 శాతం వరకు ఉంటుందని భావించారు. కానీ, ఇది ఆ అంచనాలను అందుకోలేకపోయింది. గతేడాది వృద్ధిరేటు పతనంతో పోలిస్తే ఇది భారీ అభివృద్ధి కిందే లెక్క. వీటిని చైనా గణాంకాల విభాగం‌ విడుదల చేసింది.

చైనా వృద్ధిరేటు గణించేందుకు 2020 తొలి త్రైమాసికాన్ని బేస్‌లైన్‌గా ఎంచుకున్నారు. అప్పటికే కొవిడ్‌ వ్యాపించడం వల్ల దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించింది. ఈ కారణాలతో ఆర్థిక వ్యవస్థ 6.8 శాతం పతనమైంది.

గతేడాదితో పోలిస్తే పారిశ్రామిక వృద్ధిరేటు 14.1 శాతం, రిటైల్‌ విక్రయాలు 34.2 శాతం పెరిగాయి. 'నెలవారి సూచీలు కూడా అక్కడ ఉత్పత్తి, వ్యయం,పెట్టుబడులు క్రమంగా పుంజుకొన్న విషయాన్ని వెల్లడిస్తున్నాయి' అని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం ఆర్థికవేత్త లౌసీ క్యూజస్‌ పేర్కొన్నారు.

నిజమైన వృద్ధేనా..

ఆర్థికవేత్తలు గతంతో పోలిస్తే 19 శాతం వృద్ధి సాధిస్తుందని అంచనావేశారు. కానీ, ఆ అంచనాలను అందుకోలేదు. దీంతో కొన్ని రంగాలు ఇప్పటికీ బలహీనంగా ఉన్నట్లు భావిస్తున్నారు. అక్కడి ప్రభుత్వం ఆర్థిక ప్యాకేజీలను నిలిపివేస్తే తిరిగి వృద్ధిరేటు మందగించవచ్చని విశ్లేషిస్తున్నారు.

ఇదీ చదవండి:గగన్​యాన్​పై సహకారం కోసం భారత్-ఫ్రాన్స్​ ఒప్పందం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.