షాంఘై పుడాంగ్ విమానాశ్రయం నుంచి 300లకు పైగా కన్‌సైన్‌మెంట్లలో విదేశాలకు పంపిస్తున్న వరల్డ్ మ్యాప్‌లను చైనా కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌ను భారత్‌కు చెందిన భూభాగంగా చూపిస్తూ రూపొందించిన మ్యాప్‌లు అవి.
తమ దేశంలో ముద్రితమయ్యే మ్యాప్‌లన్నీ (విదేశాలకు ఎగుమతి చేసే వాటితో సహా) ప్రభుత్వ అధికారిక వైఖరికి అనుగుణంగానే ఉండాలని 2019లో చైనా ఆదేశాలు జారీ చేసింది. చైనా అధికారిక మ్యాప్‌కు అనుగుణంగా లేని మూడు లక్షలకు పైగా పటాలను ఆ ఏడాది ధ్వంసం చేసింది.
అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రంతో పాటు తైవాన్, దక్షిణ చైనా సముద్రం తదితర ప్రాంతాలు తమ దేశానివేనని చైనా చెబుతోంది. దక్షిణ టిబెట్‌లో అరుణాచల్‌ప్రదేశ్ అంతర్భాగమని చెబుతోంది. అయితే, ఈ వాదనను భారత్ పూర్తిగా ఖండిస్తోంది.
ఇదీ చదవండి: వ్యవస్థాపకతను ప్రోత్సహించడమే దేశార్థికానికి శిరోధార్యం