ETV Bharat / international

కరోనా ఎఫెక్ట్:​ 2,300 దాటిన మృతులు.. వుహాన్​కు డబ్ల్యూహెచ్​ఓ

కరోనా వైరస్​ మృతుల సంఖ్య 2,345కు చేరింది. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తిపై దర్యాప్తు చేసేందుకు డబ్ల్యూహెచ్​ఓ బృందం వుహాన్​ చేరుకోనున్నట్లు వైద్య అధికారులు తెలిపారు.

author img

By

Published : Feb 22, 2020, 10:00 AM IST

Updated : Mar 2, 2020, 3:55 AM IST

China's coronavirus death toll crosses 2,300, WHO team to visit Wuhan
కరోనా ఎఫెక్ట్:​ 2,300 దాటిన మృతులు.. వుహన్​కు డబ్ల్యూహెచ్​ఓ పయనం

చైనాను రోజురోజుకూ కలవరపెడుతోన్న కరోనా (కొవిడ్​-19) వైరస్​తో తాజాగా 109 మంది మరణించారు. వైరస్​ కారణంగా ఇప్పటివరకు 2,345 మంది మృతి చెందారు. 76 వేల మందికిపైగా వైరస్ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో వైరస్​ వ్యాప్తిపై దర్యాప్తు జరిపేందుకు డబ్ల్యూహెచ్​ఓ నిపుణుల బృందం వుహాన్​ చేరుకోనున్నట్లు చైనా వైద్య అధికారులు తెలిపారు. ఒక్క శుక్రవారం నాడే 397 కొత్త కేసులు నమోదయ్యాయి.

సోమవారం చైనాకు చేరుకున్న 12 మంది సభ్యుల బృందం మొదట బీజింగ్, గ్వాంగ్డాంగ్, సిచువాన్ రాష్ట్రాలను సందర్శించడానికి అనుమతి పొందింది. ఈ జాబితాలో కరోనా వైరస్ వెలుగుచూసిన హుబే, రాష్ట్ర రాజధాని వుహాన్​ ఉన్నాయా లేదా అన్నది స్పష్టం కాలేదు. అయితే చివరకు ఈ బృందం వుహాన్​ను సందర్శించడానికి చైనా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

"కరోనా వైరస్ వ్యాప్తిపై దర్యాప్తుచేయడానికి ప్రస్తుతం చైనాలో ఉన్న అంతర్జాతీయ నిపుణులు శనివారం వుహాన్​కు వెళతారు."

- జిన్హువా, ప్రభుత్వ పత్రిక

నివారణ కోసం

డబ్ల్యూహెచ్​ఓ నిపుణుల బృందం, చైనా ఆరోగ్య నిపుణులతో కలిసి, హుబే అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారని జిన్హువా పేర్కొంది. అంటువ్యాధి వ్యాప్తితీరు, గ్రామీణ ప్రాంతాల్లో తీసుకుంటున్న నియంత్రణ, నివారణ చర్యలను, వన్యప్రాణుల పట్ల తీసుకుంటున్న చర్యలు, వ్యాక్సిన్, ఔషధాల అభివృద్ధిపై వారితో చర్చించినట్లు తెలిపింది.

కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించడం సహా, వ్యాధిని నయంచేయడానికి ఒక ప్రామాణిక ఔషధం తయారుచేయడమే ఈ నిపుణుల బృందం లక్ష్యమని జిన్హువా పేర్కొంది.

సంప్రదాయ వైద్యంతో..

చైనాలోని సగానికిపైగా రోగులకు వుహాన్​లో సంప్రదాయ చైనీస్ వైద్యం అందిస్తున్నారని, ఫలితంగా చాలా మంది వ్యాధి నుంచి కోలుకుంటున్నారని చైనా అధికారులు తెలిపారు. అలాగే కరోనాను ఎదుర్కొనేందుకు క్లినికల్ ట్రయల్స్​లో ఉపయోగించిన కొన్ని యాంటీ వైరల్ మందులు బాగా పనిచేస్తున్నాయని వెల్లడించారు.

ఇటలీలో తొలి మరణం..

మరోవైపు కరోనా వైరస్‌ ఇటలీకి కూడా పాకింది. ఈ వైరస్‌ కారణంగా 78 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు ఇటలీ ఆరోగ్య మంత్రి వెల్లడించారు. వైరస్‌ లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన ఆ వ్యక్తి గత 10 రోజులుగా చికిత్స పొందుతూ నిన్న మృతిచెందాడు.

ఇదీ చూడండి: శాంసంగ్​ మడత ఫోన్​ ప్రీ-బుకింగ్​.. ధరెంతో తెలుసా?

Last Updated : Mar 2, 2020, 3:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.