ETV Bharat / international

చైనాలో శుక్రవారం ఒకే ఒక్క కరోనా కేసు

కరోనా వైరస్​ పుట్టినిల్లు అయిన చైనాలో కొత్తగా మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోంది. శుక్రవారం కేవలం ఒకే ఒక్కరికి వైరస్​ పాజిటివ్​గా తేలింది. దక్షిణ కొరియాలోనూ కొత్త కేసులు తగ్గుతున్నాయి.

China corona cases
చైనాలో కరోనా కేసులు
author img

By

Published : May 2, 2020, 1:07 PM IST

కరోనా పుట్టుకకు కేంద్ర బిందుమైన చైనాలో వైరస్​ కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే అక్కడ రోజువారీ కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గగా.. శుక్రవారం కేవలం ఒకే ఒక్క పాజిటివ్​ కేసు నిర్ధరణ అయినట్లు ఆ దేశ జాతీయ ఆరోగ్య కమిషన్​(ఎన్​హెచ్​సీ) ప్రకటించింది. అది కూడా విదేశాల నుంచి వచ్చిన వ్యక్తిలోనే గుర్తించినట్లు పేర్కొంది. కొవిడ్​-19తో కొత్తగా ఎవరూ మరణించలేదని స్పష్టం చేసింది.

చైనాలో ఇప్పటివరకు మొత్తం 82,875 మందికి వైరస్ సోకింది. 4,633 మంది ప్రాణాలు కోల్పోయారు. 77,685 మంది మహమ్మారి బారి నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఆ దేశంలో ప్రస్తుతం 557 యాక్టివ్​ కేసులు మాత్రమే ఉన్నాయి.

చైనాలో గతకొద్ది రోజులుగా స్థానిక కేసులేమీ నమోదుకావట్లేదు. అయితే ఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చిన 1,671 మందికి వైరస్​ సోకినట్లు నిర్ధరణ అయింది.

28 రోజులుగా సున్నా కేసులు

కరోనా పుట్టినిల్లు అయిన వుహాన్​లో​ గత 28 రోజులుగా ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. అయితే వ్యాధి లక్షణాలు లేని 20 కొత్త కేసులను గుర్తించారు అధికారులు. వీటితో కలిపి ఇలా వైరస్​ లక్షణాలు బయటపడకుండా పాజిటివ్​గా తేలిన వారి సంఖ్య హుబే రాష్ట్రంలో 989కి చేరింది.

దక్షిణ కొరియాలోనూ తగ్గుముఖం

ఇప్పటికే 10,780 కరోనా పాజిటివ్​ కేసులు నమోదైన దక్షిణ కొరియాలోనూ కొత్తగా వైరస్​ బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. తాజాగా కేవలం 6 కొవిడ్​-19 పాజిటివ్​ కేసులను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. గత నెల రోజులుగా నమోదైన రోజువారీ కేసుల్లో ఇదే అత్యల్పం. వైరస్​తో తీవ్ర ప్రభావానికి గురైన డేగు నగరంలో ఒక్క కొత్త కేసూ నమోదు కాలేదు.

దక్షిణ కొరియాలో ఇప్పటివరకు మొత్తం 10,780 మందికి వైరస్​ సోకగా.. 250 మంది ప్రాణాలు కోల్పోయారు. 9,123 మంది పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం 1407 యాక్టివ్​ కేసులున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.