ETV Bharat / international

ఆ దేశాలకు చైనా తీవ్ర హెచ్చరిక!

చైనాను ఏ దేశం అయినా అణచివేసేందుకు ప్రయత్నిస్తే 140 కోట్ల మంది చైనీయుల బలాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ దేశ అధ్యక్షుడు జిన్​పింగ్​ హెచ్చరించారు. టియాన్మెన్​ స్క్వేర్​లో నిర్వహించిన చైనా కమ్యూనిస్ట్​ పార్టీ శతవసంతోత్సవాల్లో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో హాజరైన పార్టీ కార్యకర్తలు, విద్యార్థులు జాతీయ గీతాన్ని ఆలపించారు.

china communist party, 100 years for china communist party
చైనా కమ్యూనిస్ట్​ పార్టీ శతవసంతోత్సవం
author img

By

Published : Jul 1, 2021, 9:20 AM IST

Updated : Jul 1, 2021, 11:09 AM IST

చైనాను హేళన చేసినా, అణచివేసేందుకు ప్రయత్నించినా చైనీయులు సహించరని హెచ్చరించారు అధ్యక్షుడు జిన్​పింగ్​. ఒకవేళ ఏ దేశమైనా అందుకు ప్రయత్నిస్తే 140 కోట్ల మంది చైనీయుల బలాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. దేశ సార్వభౌత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవాలన్న చైనీయుల సంకల్పాన్ని ఎవరూ తక్కువ అంచనా వేయొద్దని పేర్కొన్నారు. చైనా ఏ దేశాన్నీ లొంగదీసుకోవాలని, అణచివేయాలని ప్రయత్నించలేదని, అదే విధంగా విదేశాలు కూడా చైనాతో మసలుకోవాలని హితవు పలికారు. చైనా కమ్యూనిస్ట్​ పార్టీ శతవసంతోత్సవాల సందర్భంగా బీజింగ్​లో నిర్వహించిన కార్యక్రమంలో జిన్​పింగ్​ ఈ వ్యాఖ్యలు చేశారు.

china communist party, 100 years for china communist party
ప్రసంగిస్తున్న జిన్​పింగ్​

వేడుకలకు హాజరైన జనం

వేడుకలకు హాజరైన అధికారులు

దేశాన్ని కాపాడుకునేందుకు సైన్యాన్ని మరింత పటిష్ఠం చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు జిన్​పింగ్.

'తైవాన్​ మాదే'

ఈ కార్యక్రమం సందర్భంగా తైవాన్​ వివాదంపై జిన్​పింగ్​ కీలక వ్యాఖ్యలు చేశారు.

"తైవాన్​ను చైనాలో అంతర్భాగం చేసుకోవడం చైనా కమ్యూనిస్ట్​ పార్టీ లక్ష్యం. ఇందులో రాజీ పడే ప్రసక్తే లేదు. తైవాన్​ స్వాతంత్ర్యం కోసం జరిపే ప్రయత్నాలను పూర్తిస్థాయిలో కట్టడి చేసే విధంగా చర్యలు చేపట్టి.. అందరం కలిసికట్టుగా దేశాభివృద్ధికి కృషి చేయాలి.

చైనా కమ్యూనిస్ట్​ పార్టీని ప్రజల నుంచి ఎవరూ వేరు చేయలేరు. అటువంటి ప్రయత్నాలకు కూడా మేము అవకాశం ఇవ్వం."

-జిన్​పింగ్, చైనా అధ్యక్షుడు

గీతాలను ఆలపిస్తున్న విద్యార్థులు

వందేళ్ల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా చైనా కమ్యూనిస్ట్​ పార్టీ గురువారం శతవసంతోత్సవాలను నిర్వహించింది. టియాన్మెన్​ స్క్వేర్​లో జరిగిన ఈ కార్యక్రమంలో వేల సంఖ్యలో పార్టీ కార్యకర్తలు సహా విద్యార్థులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి : 'ఆ టీకాతో పిల్లలకు కరోనా నుంచి రక్షణ!'

Last Updated : Jul 1, 2021, 11:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.