ప్రపంచాన్ని కలవరపెడుతోన్న కరోనా వైరస్ చైనాలో వేగంగా విజృంభిస్తోంది. కరోనా కాటుకు బుధవారం ఒక్కరోజునే 73 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 563కు చేరింది.
చైనాలో మొత్తం 28,018 మందికి ఈ మహమ్మారి సోకినట్లు ఆ దేశ ఆరోగ్య కమిషన్ అధికారిక ప్రకటన చేసింది.
కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు చర్యలు వేగవంతం చేసిన చైనా.. 10 రోజుల్లోనే వెయ్యి పడకల ఆస్పత్రిని నిర్మించింది. సైన్యాన్ని రంగంలోకి దించింది. అలాగే.. ఆస్పత్రులు సరిపోకపోతే.. హోటళ్లు, పాఠశాలలను చికిత్స కేంద్రాలుగా మార్చాలని ఆదేశాలు ఇచ్చింది. పలు నగరాల రాకపోకలపై ఆంక్షలు విధించింది.
ప్రపంచవ్యాప్తంగా 27కు పైగా దేశాలకు ఈ వైరస్ సోకింది.
ఇదీ చూడండి: కార్చిచ్చులా విస్తరిస్తోన్న కరోనా.. ఏఏ దేశంలో ఎన్ని కేసులు