ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది కొవిడ్-19 (కరోనా) వైరస్. వ్యాధి కేంద్రస్థానమైన చైనాలో గురువారం ఒక్కరోజే 116 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రాణాంతక మహమ్మారి ధాటికి మొత్తంగా 1483 మంది అసువులు బాశారు. 4823 నూతన కేసులు నమోదయ్యాయని.. మొత్తంగా 64,600 మందికి వ్యాధి లక్షణాలు నిర్ధరణ అయినట్లు వెల్లడించారు.
సరైన సమయంలో చికిత్స అందించేందుకు వీలుగా వ్యాధి నిర్ధరణ పరీక్షలను త్వరితగతిన పూర్తి చేస్తున్నట్లు వెల్లడించారు హూబీ అధికారులు. అయితే చైనా అధికారులు ప్రకటించిన దానికంటే ఎక్కువగానే వ్యాధి ప్రబలుతోందని సమాచారం.
ఇదీ చూడండి: కొవిడ్-19 భయాలున్నా నౌకకు ఆహ్వానం.. ఆ దేశానికి సలాం!