ETV Bharat / international

అవినీతి నేతల అండతో చైనా దురాక్రమణ కుట్రలు!

ఇప్పటికే కుంగిపోయిన ఆర్థిక వ్యవస్థలను తన అవినీతి చేష్టలతో చైనా మరింత దుర్భలంగా మార్చుతోంది. బలహీన దేశాల్లో డబ్బులు ఎరగా చూపి తన పని కానిచ్చేస్తోంది. తాజాగా డ్రాగన్​తో కలిసి నేపాల్ ప్రధాని ఓలి సాగించిన అవినీతి బాగోతం బయటకు వచ్చింది. ఇంతకీ చైనా ప్రోత్సాహంతో ఓలి ఎంత వెనకేసుకున్నారో తెలుసా...?

China uses corrupt leaders to make inroads into weaker countries like Nepal: Report
బలహీన దేశాలతో చైనా అవినీతి యుద్ధం!
author img

By

Published : Jul 15, 2020, 12:05 PM IST

సలామీ స్లైసింగ్​- వివిధ దేశాలను కొద్దికొద్దిగా ఆక్రమించడానికి చైనా ప్రభుత్వం అనుసరించే ప్రణాళిక.

డెట్​ ట్రాప్ డిప్లమసీ- తిరిగి చెల్లించలేని స్థాయిలో రుణాలు అందించి దేశాలను తమ చెప్పుచేతల్లో ఉంచుకోవడానికి అమలు చేసే వ్యూహం.

వీటితో పాటు ఇతర దేశాల అంతర్గత రాజకీయాన్ని నడిపించడానికి మరో చౌకబారు ఎత్తుగడను చైనా తన ఆయుధంగా ఉపయోగిస్తోంది. ఇప్పటికే దుర్భల స్థితిలో ఉన్న దేశాలను మరింత కుంగదీసి తన చెప్పుచేతల్లో పెట్టుకునేలా ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. ఆయా దేశాల్లోని రాజకీయ నాయకులను పావులుగా ఆడిస్తోంది. ఆ అధమ ఆయుధం పేరే 'అవినీతి'.

నేపాల్​లో ఇదే తీరు!

ఆర్థికంగా బలహీనంగా ఉన్న దేశాల్లో తలదూర్చేందుకు అవినీతి మరకలంటుకున్న నేతలను ఆయుధాలుగా ఉపయోగించుకుంటోందని గ్లోబల్ వాచ్ అనాలసిస్​లో ప్రచురితమైన ఓ కథనం వెల్లడించింది. నేపాల్​లో ప్రస్తుతం జరుగుతున్నది కూడా ఇదేనని ఈ కథనాన్ని రచించిన రోలాండ్ జాక్వార్డ్ పేర్కొన్నారు.

"ఇది(అవినీతి రాజకీయం) చైనా కంపెనీలకు ఆ దేశంలో వ్యాపార ప్రయోజనాలను పెంచుకోవడానికి అధికారం కల్పిస్తుంది. అంతేకాకుండా ఆ దేశంపై దీర్ఘకాలంలో తన పట్టును పెంచుకునేందుకు, దేశ రాజకీయాల్లో చొచ్చుకుపోయేందుకు వీలు కల్పిస్తుంది."

-రోలాండ్ జాక్వార్డ్, రచయిత

కోట్లకు పడగలెత్తిన ఓలి

నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి విషయాన్ని కథనం ప్రస్తావించింది. గత కొన్నేళ్లలో ఓలి సంపాదన గణనీయంగా పెరిగిందని పేర్కొంది. ఈ కమ్యూనిస్ట్ నేత తన ఆదాయాన్ని విదేశాల్లో దాచుకున్నారని వివరించింది.

"ఆయనకు మిరాబండ్​ బ్యాంక్ జెనీవా బ్రాంచ్​​లో ఖాతా ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఆ ఖాతాలో 55 లక్షల డాలర్లు ఉన్నాయి. దీర్ఘకాలిక డిపాజిట్లు, షేర్లలో పెట్టిన పెట్టుబడుల ద్వారా ఓలి, ఆయన భార్య రాధిక సంవత్సరానికి 5 లక్షల డాలర్లు సంపాదిస్తున్నారు."

-రోలాండ్ జాక్వార్డ్, రచయిత

ఈ మేరకు ఓలిపై ఉన్న అవినీతి ఆరోపణలను ఉదాహరణలతో వివరించారు జాక్వార్డ్. చైనా కంపెనీలతో చేసుకున్న వ్యాపార ఒప్పందాల ద్వారా డబ్బు సంపాదించారని పేర్కొన్నారు. 2015-16లో నేపాల్ ప్రధానిగా తొలిసారి బాధ్యతలు చేపట్టినప్పుడు వచ్చిన ఆరోపణలను వెల్లడించారు. నేపాల్​లోని అప్పటి చైనా రాయబారి వూ చుంటై సహకారంతో కంబోడియాలోని టెలికమ్యూనికేషన్ రంగంలో ఓలి పెట్టుబడులు పెట్టినట్లు తెలిపారు.

ఇదీ చదవండి- 'సైనికుల అంత్యక్రియలకు చైనా నో అందుకే'

ఈ ఒప్పందం నేపాల్​ వ్యాపారవేత్త, ఓలి సన్నిహితుడైన అంగ్ షేరింగ్ షెర్పా కుదిర్చారని జాక్వర్డ్ వెల్లడించారు. ఫ్నోమ్​ పేన్హ్​(కంబోడియా రాజధాని)లోని చైనా అత్యున్నత దౌత్యవేత్త సహకారంతో కంబోడియా ప్రధానమంత్రి హున్​సెన్​ జోక్యంతో ఈ ఒప్పందం కుదిరినట్లు చెప్పారు.

ప్రాజెక్టులన్నీ చైనాకే

ఓలి రెండోసారి గద్దెనెక్కిన తర్వాతా ఇలాంటి అవినీతి ఆరోపణలు కొనసాగాయని పేర్కొన్నారు. ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే డిసెంబర్ 2018లో డిజిటల్ యాక్షన్ రూమ్​ ఏర్పాటు చేసే ప్రాజెక్టును ఎలాంటి బిడ్డింగ్ ప్రక్రియ చేపట్టకుండానే చైనా టెలికాం కంపెనీ హూవావేకి కట్టబెట్టినట్లు తెలిపారు. నేపాల్ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థకు డిజిటల్ యాక్షన్ రూం ఏర్పాటు చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ చైనావైపే మొగ్గుచూపినట్లు పేర్కొన్నారు. ప్రధానమంత్రి రాజకీయ సలహాదారుడైన బిష్ణు రిమాల్​ కుమారుడు డబ్బు కోసం ఈ ఒప్పందానికి ముందుకొచ్చారని తదుపరి విచారణలో తేలిందని నివేదిక వివరించింది.

  • వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్టులను నేపాల్ ప్రభుత్వం ఎలాంటి చర్చలు జరపకుండానే చైనా కంపెనీలకు అప్పజెప్పింది.
  • మే 2019లో రేడియో యాక్సెస్ నెట్​వర్క్​ కోసం హాంకాంగ్​లో ఉన్న చైనా సంస్థతో నేపాల్ ప్రభుత్వం ఒప్పందం.
  • దేశంలో 4జీ నెట్​వర్క్​ అందించేందుకు టెలికాం పరికరాలు తయారుచేసే చైనీస్ సంస్థ జడ్​టీఈతో మరో ఒప్పందం
  • ఈ ఒప్పందం విలువ దాదాపు రూ. 12 వందల కోట్లు.

దేశంలో వ్యతిరేకత

ఈ ఏడాది జూన్​లో నేపాల్​ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ దేశ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన ప్రదర్శన చేపట్టారు. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో విఫలమైనట్లు ఆరోపించారు. చైనా నుంచి నాసిరకం పీపీఈ, టెస్టింగ్ కిట్లు అధిక ధరలకు కొనుగోలు చేశారని, ఇందులో అవినీతి దాగుందని మండిపడ్డారు. కరోనా పోరులో ప్రభుత్వం ఖర్చు చేశామని చెబుతున్న రూ. 625 కోట్లకు లెక్కచెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం వైద్య పరికరాల కొనుగోలు వ్యవహారంలో నేపాల్ వైద్య శాఖ మంత్రి సహా ఓలి సన్నిహితులైన పలువురు సీనియర్ సలహాదారులపై విచారణ కొనసాగుతోంది.

ఇదీ చదవండి- భారత్​-చైనా మధ్య దోస్తీ కుదిరేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.