తమ దేశానికి చెందిన 59 యాప్‌లపై భారత్ నిషేధం విధించడాన్ని చైనా తీవ్రంగా తప్పుబట్టింది. భారత ప్రభుత్వ చర్య వివక్షపూరితంగా ఉందని చైనా వాణిజ్య శాఖ అధికార ప్రతినిధి గావో ఫెంగ్ విమర్శించారు. వెంటనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తమ దేశ వ్యాపార సంస్థలపై వివక్షపూరిత ధోరణులను ఇకనైనా మానుకోవాలన్నారు.
భారత్‌కు దిగుమతి చేసే వస్తువులపై తాము ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు ఫెంగ్. యాప్‌లపై నిషేధం నిర్ణయాన్ని భారత్ వెనక్కి తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.