తైవాన్‌కు మద్దతుగా అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ అనుసరించిన ప్రమాదకర విధానాలను జో బైడెన్ పాలనా యాంత్రాంగం విడనాడాలని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూ హెచ్చరించారు. తైవాన్ తమ సొంత భూభాగంగా పేర్కొన్న ఆయన.. అక్కడ ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వంతో అమెరికా అధికారికంగా ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని సూచించారు.
1949లో చైనా ప్రధాన భూభాగంతో తైవాన్ విడిపోయినప్పటికీ.. తమ దేశ సార్వభౌమత్వం కొనసాగుతోందని చెప్పారు. జనవరిలో అధికారం చేపట్టిన వెంటనే.. బైడెన్ కొంతమంది అధికారులను మద్దతు తెలిపేందుకు తైవాన్‌కు పంపించారని విమర్శించారు. తైవాన్ విషయంలో చైనా రాజీపడే ప్రసక్తే లేదన్నారు వాంగ్ యూ. ఈ అంశంలో అమెరికా తలదూర్చకుండా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు.
అమెరికా మద్దతు చూసుకోని తైవాన్ అధికారికంగా స్వతంత్రత ప్రకటించుకున్నా. చైనాతో చర్చలు ఆలస్యం చేసినా ప్రధాన భూభాగంతో ఏకం చేయడానికి చర్యలు తీసుకుంటామని వాంగ్ యూ హెచ్చరించారు.
ఇదీ చదవండి:భారత సరిహద్దుల వరకు చైనా బుల్లెట్ ట్రైన్!