ETV Bharat / international

నౌక నుంచి అంతరిక్షంలోకి దూసుకెళ్లిన చైనా రాకెట్​ - చైనా 9 శాటిలైట్ ప్రయోగం

చైనా మరోసారి సముద్రం నుంచి రాకెట్​ను విజయవంతంగా ప్రయోగించింది. ఎల్లో సముద్రంలో నౌక​ నుంచి లాంగ్​ మార్చ్​11హెచ్​వై2 రాకెట్​ అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగంలో తొమ్మిది ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి పంపింది.

China successfully launches 9 satellites into orbit from ship
షిప్​ నుంచి రెండోసారి విజయవంతంగా రాకెట్ ప్రయోగం
author img

By

Published : Sep 15, 2020, 9:28 PM IST

ఎల్లో సముద్రంలోని ఓ నౌక నుంచి 9 ఉపగ్రహాలతో కూడిన రాకెట్​ను విజయవంతంగా ప్రయోగించింది చైనా. ఇలా సముద్రం నుంచి చైనా రాకెట్లను ప్రయోగించడం ఇది రెండోసారి. సాలిడ్​-ప్రొపెల్లెంట్లను మోస్తూ.. ఈ లాంగ్​ మార్చ్​11హెచ్​వై2 రాకెట్​ అంతరిక్షంలోకి దూసుకెళ్లిందని చైనా ప్రభుత్వ అధికారిక మీడియా నివేదించింది.

జిలిన్​-1 గాఫెన్​03-1 గ్రూప్​నకు చెందిన ఈ ఉపగ్రహాల్లో ఆరు.. హై-రెజల్యూషన్​లో ​భూమిని ఫొటోతీస్తాయి, మరో మూడు వీడియో తీస్తాయి. ఇవి వ్యవసాయం, అటవీ, భూవనరులు, పర్యావరణ పరిరక్షణ వంటి సేవలను అందిస్తాయని మీడియా పేర్కొంది.

ఇదీ చూడండి ఎస్​సీఓ భేటీలో పాక్​ తప్పుడు మ్యాప్​.. భారత్​ వాకౌట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.