అంతరిక్ష ప్రయోగాల్లో చైనా దూకుడు ప్రదర్శిస్తోంది. కొత్తగా మూడు రిమోట్ సెన్సింగ్ శాటిలైట్లను(remote sensing satellite) విజయవంతంగా ప్రయోగించినట్లు తెలిపింది. పశ్చిమ చైనాలోని సిచౌన్ ప్రావిన్స్, జిచాంగ్ శాటిలైట్ లాంఛ్ కేంద్రం నుంచి ఈ ప్రయోగం(china satellite news) చేపట్టినట్లు వెల్లడించింది.
యోగాన్-35 విభాగానికి చెందిన ఈ మూడు ఉపగ్రహాలను(remote sensing satellite china) లాంగ్ మార్చ్-2డీ రాకెట్ విజయవంతంగా అంతరిక్షంలోకి తీసుకెళ్లినట్లు పేర్కొంది చైనా అధికారిక మీడియా. లాంగ్ మార్చ్ సిరీస్ రాకెట్స్ ద్వారా చేపట్టిన 396వ మిషన్‌గా తెలిపింది.
2019 మార్చిలో లాంగ్ మార్చ్-3బీ రాకెట్ విజయవంతంగా(china satellite news) నింగిలోకి దూసుకెళ్లింది. అది చైనా విజయవంతంగా పూర్తి చేసిన 300వ ప్రయోగంగా నిలించినట్లు పేర్కొంది. లాంగ్ మార్చ్ వాహక రాకెట్ సిరీస్‌ను చైనా ఎయిరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్పొరేషన్ అభివృద్ధి చేసింది. చైనా చేపట్టిన మొత్తం ప్రయోగాల్లో ఈ రాకెట్ల ద్వారానే 96.4 శాతం పూర్తి చేయటం గమనార్హం. తొలి వంద ప్రయోగాలకు 37 ఏళ్లు పట్టగా.. తదుపరి వందకు 7.5 ఏళ్లు, ఆ తర్వాత నాలుగేళ్లలోనే మరో వంద ప్రయోగాలను చైనా చేపట్టింది.
ఇదీ చూడండి: ఆకాశవీధిలో 100ఎంబీపీఎస్ నెట్- చైనా ప్రయోగం