ETV Bharat / international

బెడిసికొడుతున్న చైనా వ్యూహం-భారత్​దే పైచేయి! - చైనా దౌత్య వ్యూహానికి భారత్​ బ్రేక్​

కొవిడ్​-19 సంక్షోభంతో తమపై పడ్డ మచ్చను తొలగించుకోవాలని భావించిన చైనా వ్యూహం బెడిసికొట్టింది. పొరుగు దేశాలకు టీకా అందిస్తామన్న ఆ దేశం.. సకాలంలో స్పందించలేక విమర్శలపాలైంది. ఇలా.. దౌత్యం ప్రదర్శించేందుకు ఉవ్విళ్లూరిన జిన్​పింగ్​ సర్కార్​ ఆగడాలను భారత్ పరోక్షంగా దెబ్బతీస్తోంది. చైనా వ్యూహాలను పక్కాగా అమలు చేసిన మోదీ ప్రభుత్వం.. ఐరాస సహా ప్రపంచ దేశాల మన్ననలు పొందుతోంది.

China strategy of Vaccine diplomacy loosing Faith
బెడిసికొడుతున్న చైనా వ్యూహం!
author img

By

Published : Jan 30, 2021, 11:05 AM IST

కరోనా సంక్షోభాన్ని ఆసరాగా తీసుకొని టీకా దౌత్యం ప్రదర్శించేందుకు ఉవ్విళ్లూరిన చైనా.. చివరకు చతికిలపడుతోంది. ఇచ్చిన మాట ప్రకారం పొరుగు దేశాలకు సకాలంలో టీకా అందించలేక అపప్రదను మూటగట్టుకుంటోంది. మరోవైపు.. భారత్‌ ఈ విషయంలో దూసుకుపోతోంది. రుణాల పేరిట పొరుగు దేశాలను తన బుట్టలో వేసుకోవాలనుకున్న చైనా ఆగడాలకు చెక్‌ పెట్టేందుకు భారత్‌ దీన్ని ఓ అవకాశంగా మలచుకుంటోంది.

చైనాను నమ్ముకుంటే అంతే సంగతులు..

జనవరి 11న మయన్మార్‌ పర్యటనకు వెళ్లిన చైనా విదేశాంగమంత్రి వాంగ్‌ యీ 3 లక్షల కొవిడ్‌ టీకా డోసులు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఇంతవరకు అవి చేరలేదు. దీనిపై మయన్మార్‌ ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. చైనాపై నమ్మకంతో ఇతర టీకాల కొనుగోలు విషయంలో కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరించిన మయన్మార్‌కు మూల్యం చెల్లించుకోక తప్పలేదు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన భారత్‌ 15 లక్షల డోసులు అందించి ఆపదలో ఆదుకుంది. భారత్‌ సాయంతో అక్కడి ప్రభుత్వం.. వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభించింది.

అలాగే చైనాకు చెందిన సైనోవాక్ బయోటెక్ లిమిటెడ్ తయారుచేసిన కరోనా వ్యాక్సిన్‌ను బంగ్లాదేశ్‌ ప్రభుత్వం తిరస్కరించింది. ఈ టీకా ట్రయల్స్‌ కోసం అయ్యే ఖర్చును పంచుకోవాలని కోరడమే అందుకు కారణం. ఇక బంగ్లాదేశ్‌కు చెందిన బెక్సిమో ఫార్మా.. సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది.

గత్యంతరం లేకే..

వాస్తవానికి చైనా టీకాల సామర్థ్యంపై ఆది నుంచీ అనుమానాలు ఉన్నాయి. కానీ.. అందుబాటులోకి వచ్చిన ఫైజర్‌, మోడెర్నా, ఆస్ట్రాజెనెకా టీకాలను పూర్తిగా ధనిక దేశాలు బుక్ చేసుకోవడం వల్ల మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే ఆర్థికంగా వెనుకబడిన కొన్ని దేశాలు చైనా టీకాలపై ఆధారపడ్డాయి.

ఇదీ చదవండి: వుహాన్​ ఆస్పత్రుల్లో కరోనా మూలాలపై శోధన

అసలు కారణాలివే..

చైనా జాప్యం చేయడానికి ముఖ్య కారణం.. దేశీయంగా సరిపడా డోసులు లేకపోవడమేనని తెలుస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనాలో ప్రతిఒక్కరికీ టీకా అందించేందుకు చాలా సమయమే పడుతుంది. ఈ క్రమంలో అక్కడ ఉత్పత్తవుతున్న టీకాలన్నీ.. దేశీయంగా సరఫరా చేయడానికే సరిపోతున్నాయి. మరోవైపు.. ఇటీవల అక్కడ కరోనా కేసులు మరోసారి వెలుగులోకి రావడం తీవ్రంగా కలవరపెట్టింది. ఫలితంగా.. బీజింగ్, వుహాన్‌ వంటి నగరాల్లో మరోసారి లాక్‌డౌన్‌ విధించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా అక్కడి ప్రజలకు టీకా అందించేందుకు జిన్‌పింగ్‌ ప్రభుత్వం సన్నద్ధమైంది.

కరోనా విషయంలో అంతర్జాతీయ సమాజం ముందు ఇప్పటికే దోషిగా ఉన్న తాము ఈసారి నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అర్థమైంది. అలాగే కొవిడ్ కట్టడి కోసం అత్యంత కఠినంగా వ్యవహరించిన ప్రభుత్వం పట్ల అక్కడి ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో టీకా అందజేయడంలో ఆలస్యమైతే.. అంతర్గతంగా తీవ్ర నిరసనలు, తిరుగుబాట్లకు దారితీయొచ్చని భావించినట్లు తెలుస్తోంది. మరోవైపు మహమ్మారి పుట్టుపూర్వోత్తరాల కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందం ప్రస్తుతం చైనాలో పర్యటిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే చైనా దేశీయంగా టీకాల సరఫరాకు తొలి ప్రాధాన్యం ఇస్తోంది. టీకా దౌత్య వ్యూహాన్ని అమలు చేయడంలో జాప్యం చేస్తోంది.

ఇదీ చదవండి: డబ్ల్యూహెచ్​ఓకు మా బాధ చెప్పాలి: వుహాన్​ ప్రజలు

ఇదీ చదవండి: చైనాలో 2.27కోట్ల మందికి కరోనా టీకా

దుర్బుద్ధికి తగిన మూల్యం..

టీకా దౌత్యాన్ని చైనా అవకాశంగా మలచుకోవాలని చూసింది. ముఖ్యంగా దక్షిణాసియా దేశాలకు వ్యాక్సిన్‌ అందించి తమపై విధేయతను పెంచుకోవాలని భావించింది. ఇప్పటికే రుణాలు, 'వన్‌ బెల్ట్‌ వన్‌ రోడ్‌' పేరిట పాక్​ సహా.. మరికొన్ని దేశాలను అప్పుల వలయంలోకి దింపిన తమకు ఇది మరింత కలిసొస్తుందని ఆలోచించింది. తద్వారా ప్రాంతీయంగా భారత్‌ ఎదుగుదలను అడ్డుకోవాలని చూసింది. ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో ఆధిపత్యం చెలాయించొచ్చని భావించింది. అలాగే రోజురోజుకీ కరోనా తీవ్రత పెరుగుతున్న లాటిన్‌ అమెరికా, కరీబియన్‌ దేశాలకు టీకా అందించి.. అంతర్జాతీయంగా దిగజారిన ప్రతిష్ఠను పునరుద్ధరించుకోవాలనుకుంది. కరోనా విరుచుకుపడిన తొలినాళ్లలో చైనా సరఫరా చేసిన మాస్కులు, పీపీఈ కిట్లు లోపభూయిష్ఠమని తేలాయి. తాజాగా.. చైనా తన సైనోవాక్‌ టీకాను పరీక్షిస్తున్న దేశాలను ప్రయోగ ఖర్చులు పంచుకోవాలని కోరింది. ఇలా.. చైనా పన్నుతున్న కుట్రలన్నీ క్రమంగా బెడిసికొడుతుండడం గమనార్హం.

ఇదీ చదవండి: కరోనా ముప్పు తొలగిపోలేదు: షీ జిన్‌పింగ్

భారత్‌ విజయం..

మరోవైపు.. వ్యాక్సిన్‌ దౌత్యాన్ని భారత్‌ సరైన దిశగా తీసుకెళుతోంది. బంగ్లాదేశ్‌, భూటాన్‌, నేపాల్‌, మాల్దీవులకు ఉచితంగా 32 లక్షల టీకా డోసులు పంపింది. భారత్‌కు ఇటీవల నేపాల్‌, బంగ్లాదేశ్‌లతో ఏర్పడిన పొరపొచ్చాలను సరిదిద్దడానికి టీకా దౌత్యాన్ని ఉపయోగించుకునేందుకు యోచిస్తోంది. భారత్‌ త్వరలో సెషెల్స్‌, అఫ్గానిస్థాన్‌, మారిషస్‌, శ్రీలంక, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా, ఒమన్‌, నికరాగ్వా, పసిఫిక్‌ ద్వీప దేశాలకు టీకాలు పంపేందుకు సిద్ధమవుతోంది. అంతేకాకుండా.. ఆఫ్రికా దేశాలకు ప్రత్యేకంగా కోటి డోసుల్ని, ఐరాసకు 10 లక్షల డోసుల్ని ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. మొత్తం 92 దేశాలు భారత టీకాలపై ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.

భారత్‌ గతంలోనూ 150 దేశాలకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌, రెమ్‌డెసివిర్‌, పీపీఈలు, టెస్ట్‌ కిట్లు పంపి అందరి మన్ననలూ పొందింది. నాడు.. భారత్‌ చవకగా హెచ్‌ఐవీ జనరిక్‌ మందులను ఆఫ్రికా దేశాలకు సరఫరా చేసింది. ప్రపంచంలో వివిధ టీకాలకు ఉన్న డిమాండులో 62 శాతాన్ని తీరుస్తున్న భారత్‌.. కరోనా టీకాలను కొన్ని దేశాలకు ఉచితంగా సరఫరా చేస్తూ ప్రపంచ దేశాల నుంచి ప్రశంసలందుకుంటోంది.

ఇవీ చదవండి: ప్రధాని.. రాష్ట్రపతి.. అందరూ మహిళలే!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.