ETV Bharat / international

ఒక్క అంగుళం కూడా వదులుకోం: చైనా - చైనా భారత్​ యుద్ధం

రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​తో చైనా రక్షణమంత్రి ఫెంగే జరిపిన సమావేశంపై ఆ దేశం అధికారిక ప్రకటన విడుదల చేసింది. సరిహద్దు ఉద్రిక్తతలపై మరోసారి అవే అసత్యాలు చెప్పుకొచ్చింది. భారత్​ చర్యల వల్లే ఉద్రిక్తతలు తలెత్తాయని ఆరోపించింది.

China
ఒక్క అంగుళం కూడా వదులుకోం: చైనా
author img

By

Published : Sep 5, 2020, 4:45 PM IST

Updated : Sep 5, 2020, 5:07 PM IST

సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై చైనా మరోసారి అసత్యాలను వల్లె వేసింది. మాస్కోలో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌తో చైనా రక్షణ మంత్రి ఫెంగే సమావేశం అనంతరం ఆ దేశం ఓ ప్రకటన జారీ చేసింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు బాధ్యత మొత్తం భారత్‌దేనని వ్యాఖ్యానించింది. భారత్‌ చర్యల వల్లే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని పేర్కొంది. తమ సార్వభౌమ ప్రదేశం నుంచి ఒక్క అంగుళం కూడా వదులకునేందుకు సిద్ధంగా లేమని పేర్కొంది.

షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) రక్షణ మంత్రుల సమావేశానికి హాజరైన రాజ్‌నాథ్‌, ఫెంగే విడిగా భేటీ అయ్యారు. ఈ భేటీలో ఘర్షణలకు ముందు ఉన్న స్థితిని వెంటనే పునరుద్ధరించాలని చైనాకు భారత్‌ తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో చైనా తన చర్యలను సమర్థించుకుంటూ ఈ ప్రకటన విడుదల చేసింది. తమ సరిహద్దులు కాపాడుకునేందుకు చైనా సైన్యం ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటుందని తెలిపింది.

ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ మధ్య కుదిరిన ఏకాభిప్రాయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఆ ఒప్పందాన్ని అమల్లో చూపాలని భారత్‌కు ఉచిత సలహా ఇచ్చింది. ఉద్రిక్తతలను చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకోగలమని వ్యాఖ్యానించింది. ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరత.. ఉద్రిక్తతలు తగ్గించడం.. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై దృష్టి సారించాల్సి ఉందని పేర్కొంది.

భారత్‌ కూడా అదే రీతిన సమాధానమిస్తూ మరో ప్రకటన విడుదల చేసింది. తాము కూడా సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు కట్టుబడి ఉంటామని ఘాటుగా బదులిచ్చింది. అదే సమయంలో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఇరు దేశాలు కృషి చేయాలని సూచించింది. ద్వైపాక్షికంగా, సైనిక మార్గాల్లో ఈ చర్చలు ఉండాలని పేర్కొంది.

Last Updated : Sep 5, 2020, 5:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.