తమ దేశానికి రావాలంటే తప్పనిసరిగా అక్కడ తయారైన టీకా వేయించుకోవాలనే నిబంధన భారతీయ విద్యార్థులకూ వర్తిస్తుందా అనే అంశాన్ని పరిశీలిస్తామని చైనా తెలిపింది. తమ దేశంలోని విదేశీ విద్యార్థుల హక్కుల పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తామని పేర్కొంది. సమన్వయ పద్ధతిలో ఈ వ్యవహారాన్ని అధికారులు అధ్యయనం చేసి సంబంధిత వర్గాలకు సమాచారం ఇస్తారని చెప్పింది.
23 వేలకు పైగా భారతీయ విద్యార్థులు చైనాలో విద్యనభ్యసిస్తున్నారు. ప్రయాణ ఆంక్షల నేపథ్యంలో వారిలో చాలా మంది తిరిగి ఆ దేశానికి వెళ్లలేకపోతున్నారు. కాగా మార్చి 15 నుంచి చైనాకు వెళ్లానుకునేవారికి ఆ దేశ రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలో టీకాలు, ధ్రువపత్రాలు అందిస్తున్నారు.
ఇదీ చూడండి: 'మా టీకా వేసుకుంటేనే దేశంలోకి అనుమతి'