ETV Bharat / international

డబ్ల్యూహెచ్​ఓ బృందం వుహాన్ పర్యటన ఖరారు - చైనా డబ్ల్యూహెచ్​ఓ

డబ్ల్యూహెచ్​ఓ బృందం.. చైనా పర్యటన ఖరారైంది. గురువారం వీరు వుహాన్​కు రానున్నట్లు చైనా వెల్లడించింది. కరోనా ఆవిర్భావంపై ఈ బృందం దర్యాప్తు చేపట్టనుంది.

China says WHO experts to visit Wuhan in virus origins probe
డబ్ల్యూహెచ్​ఓ బృందం చైనా పర్యటన ఖరారు
author img

By

Published : Jan 12, 2021, 4:44 PM IST

కరోనా మహమ్మారి ఆవిర్భావంపై దర్యాప్తు కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) బృందం చైనాకు గురువారం రానున్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి ఝావో లిజియాన్ వెల్లడించారు. వుహాన్​లో నిపుణుల బృందం పర్యటించనున్నట్లు తెలిపారు. అక్కడే దర్యాప్తు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని వివరించలేదు.

చైనాలో పర్యటించేందుకు నెలల నుంచి ఎదురుచూస్తోంది డబ్ల్యూహెచ్​ఓ. పర్యటనకు అడ్డంకులు ఎదురవడం పట్ల సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ సైతం అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన టెడ్రోస్.. తొలి కేసు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై దర్యాప్తు చేయనున్నట్లు చెప్పారు.

కరోనావైరస్ చైనాలోనే ఉద్భవించిందనే ఆరోపణలను ఆ దేశం ఖండిస్తోంది. అదేసమయంలో దేశంలో జరుగుతున్న పరిశోధనలపై ఉక్కుపాదం మోపుతోంది. బయటినుంచే వైరస్ వచ్చిందని అర్థంలేని సిద్ధాంతాలను వల్లే వేస్తోంది.

ఇదీ చదవండి: కొవిడ్‌-19: మిస్టరీ మూలాలపై దర్యాప్తు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.