ETV Bharat / international

'చైనాతో సహకారం కంటే సంఘర్షణకే అమెరికా మొగ్గు'

తమపై అమెరికా అనుసరిస్తున్న విధానం.. అత్యంత ప్రతికూలంగా ఉందని చైనా తెలిపింది. సహకారం కంటే సంఘర్షణకే అమెరికా అధిక ప్రాధాన్యమిస్తోందని ఆరోపించింది. అయితే.. వాతావరణ మార్పులపై అమెరికా నిర్వహించనున్న సదస్సులో తాము సానుకూల సందేశాన్ని పంపుతామని స్పష్టం చేసింది.

China and america
మాపై అమెరికా విధానం సరిగా లేదు: చైనా
author img

By

Published : Apr 16, 2021, 7:59 PM IST

తమ దేశంపై అమెరికా అనుసరిస్తున్న విధానాన్ని చైనా తప్పు పట్టింది. అత్యంత ప్రతికూల ధోరణిలో అమెరికా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించింది. సహకారం కంటే సంఘర్షణకే అగ్రరాజ్యం ప్రాముఖ్యతనిస్తోందని ఆరోపించింది. ఈ మేరకు అసోసియేటెడ్​ ప్రెస్​ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చైనా దౌత్యవేత్త లే యుచెంగ్​ అభిప్రాయపడ్డారు.

ఆర్థిక పునరుజ్జీవం, కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడంపై దృష్టి సారించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​కు సహకారాన్ని బలోపేతం చేసుకోవడం అత్యంత ప్రాధాన్యమైన అంశమని లే యుచెంగ్​ పేర్కొన్నారు. ఇరు దేశాలు కలిసి పని చేయటంలో ఎన్నో సవాళ్లు ఉన్నాయని అన్నారు. పోటీ, ఘర్షణలకే ఇరు దేశాలు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల సమష్టిగా ముందుకు సాగలేకపోతున్నాయని తెలిపారు.

సానుకూల సందేశం ఇస్తాం..

అమెరికా పిలుపునిచ్చిన వాతావారణ సదస్సులో చైనా సానుకూల సందేశాన్ని పంపనుందని లే యుచెంగ్​ తెలిపారు. వాతావరణ మార్పులపై తాము మరింత కృషి చేయటం అంటే కొంత ఇబ్బందితో కూడుకున్నదేనని పేర్కొన్నారు.

"140 కోట్ల జనాభా ఉన్న దేశంలో వాతావరణ మార్పులను కట్టడి చేయటం సులభమైన విషయం కాదు. వాతావరణ మార్పులను తగ్గించాలని కొన్ని దేశాలు మమ్మల్ని కోరుతున్నాయి. కానీ, ఆచరణలో సాధ్యం కాదు."

-లే యుచెంగ్​, చైనా దౌత్యవేత్త

వాతావరణ కాలుష్యాన్ని తగ్గించే దిశగా చర్చించడానికి నాలుగేళ్ల తర్వాత మొదటిసారి 'లీడర్స్ సమ్మిట్​' ను వచ్చే వారంలో నిర్వహించనుంది అమెరికా. అందుకోసం భారత ప్రధాని నరేంద్ర మోదీ సహా 40 దేశాల నాయకులకు శ్వేతసౌధం ఆహ్వానాన్ని పంపింది.

ఇదీ చూడండి:'మే 1 నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ'

ఇదీ చూడండి:'బ్రెగ్జిట్​'పై చర్చల్లో ఈయూ, బ్రిటన్​ విఫలం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.