ETV Bharat / international

డబ్ల్యూహెచ్​ఓలో సంస్కరణలకు మద్దతిస్తాం: చైనా - డబ్ల్యూహెచ్​వో పై ట్రంప్

కరోనా విషయంలో ఆరోగ్య సంస్థతో సంబంధాలపై ఇప్పటికే తీవ్ర విమర్శలు వస్తోన్న తరుణంలో చైనా మరో ప్రకటన చేసింది. ప్రజారోగ్య సమస్యలపై డబ్ల్యూహెచ్​ఓ సంస్కరణలకు మద్దతుగా నిలుస్తామని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.

CHINA-WHO
డబ్ల్యూహెచ్​వో సంస్కరణలకు మద్దతుగా నిలుస్తామన్న చైనా
author img

By

Published : Oct 23, 2020, 5:24 AM IST

అత్యవసర ప్రజారోగ్య సమస్యలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) సామర్థ్యం పెంపొందించే సంస్కరణలకు మద్దతిస్తామని చైనా ప్రకటించింది. కరోనా విషయంలో డబ్ల్యూహెచ్​ఓతో చైనా సంబంధాలపై విమర్శలు వస్తోన్న నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

డబ్ల్యూహెచ్​ఓలో సంస్కరణలకు ఐరోపా సమాఖ్య చర్యలు చేపడుతోందని వస్తోన్న వార్తలపై స్పందించింది చైనా. డబ్ల్యూహెచ్​ఓ పనితీరు మెరుగుపడేందుకు అవసరమయ్యే సంస్కరణలకు సహకరిస్తామని స్పష్టం చేశారు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియాన్.

ఈ నిర్ణయం రాజకీయ కోణంలో చూసేదికాదని.. సైన్స్​ను, నిపుణుల ఆలోచనా విధానాలను గౌరవించాలని జావో తెలిపారు. ప్రపంచ ప్రజారోగ్య సమస్యలను కట్టడి చేసే క్రమంలో డబ్ల్యూహెచ్​ఓకు మరింత చేయూతనిస్తున్నట్లు పేర్కొన్నారు.

ప్రత్యేకంగా ఓ దేశ రాజకీయ స్వలాభం కోసం ఈ సంస్కరణలకు సహకరించకూడదని, వివిధ దేశాల అంగీకారంతోనే పలు సంస్కరణలు చేపట్టాలని జావో స్పష్టం చేశారు.

డబ్ల్యూహెచ్​ఓపై తీవ్ర విమర్శ

కరోనా కట్టడి విషయంలో డబ్ల్యూహెచ్​ఓ తీరుపై గతంలోనే తీవ్రంగా మండిపడ్డారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. సెప్టెంబర్​ 23న జరిగిన ఐరాస సర్వసభ్య సమావేశాల్లో డబ్ల్యూహెచ్​ఓ చైనా అధ్వర్యంలో ఉందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆరోగ్య సంస్థకు ఇకపై నిధులివ్వబోమని గతంలోనే స్పష్టం చేశారు ట్రంప్.

మరోవైపు, చైనాలోని ఏ ప్రాంతంలో వైరస్​ పుట్టిందన్న దానిపై పరిశోధన చేసేందుకు ఆరోగ్య సంస్థ సర్వసన్నద్ధమవుతోంది. ఈ మేరకు ఓ శాస్త్రవేత్తల బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. కానీ, చైనా ఈ చర్యకు ఇంకా అనుమతి ఇవ్వాల్సి ఉంది.

ఇదీ చదవండి:కుల్​భూషణ్​ మరణశిక్షపై పాక్​ కీలక నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.