ETV Bharat / international

కరోనాను రెండో రోజూ డకౌట్​ చేసిన చైనా - corona effect in china

రెండు రోజులుగా చైనాలో దేశీయంగా కొత్త కరోనా కేసులు నమోదు కాలేదని ప్రకటించింది జాతీయ ఆరోగ్య కమిషన్. ఇప్పటికే సోకినవారిలో ముగ్గురు మృతి చెందగా.. మరో 31 మందికి కరోనా ఉన్నట్లు అనుమానిస్తున్నారు అధికారులు. అయితే, విదేశాల నుంచి చైనాకు వచ్చిన 39 మందికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయ్యింది.

China reports no new domestic coronavirus cases for second day
కరోనాను రెండో రోజూ డకౌట్​ చేసిన చైనా
author img

By

Published : Mar 20, 2020, 10:18 AM IST

కరోనా వైరస్​ నియంత్రణలో కీలక విజయం సాధించింది చైనా. వరుసగా రెండో రోజు అక్కడ దేశీయంగా ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదని వెల్లడించింది ఆ దేశ జాతీయ ఆరోగ్య కమిషన్​.

గతేడాది వూహాన్​లో కరోనా వైరస్ వెలుగుచూసినప్పటి నుంచి ఒక్క కరోనా పాజిటివ్​ కేసు కూడా నమోదు కాని రోజు లేదు. కానీ, ఈ రెండు రోజులుగా మాత్రం చైనావాసులకు కరోనా వ్యాపించిన దాఖలాలు కనిపించలేదు. ఈ రెండు రోజుల్లో కేవలం 31 మంది కరోనా అనుమానితులును గుర్తించినప్పటికీ.. వారిలో ఏ ఒక్కరికీ వైరస్​ ఉన్నట్లు అధికారికంగా నిర్ధరణ కాలేదు.

అయితే, కొత్తగా విదేశాల నుంచి వచ్చిన 39 మందికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. కొద్ది రోజుల క్రితం కరోనా సోకినవారిలో మరో ముగ్గురు నిన్న మృతి చెందారు.

ఇప్పటివరకు చైనా వ్యాప్తంగా 80, 967 కరోనా పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. 3,248 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 6,569 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగతా 71, 150 మంది కరోనాను జయించి, ఇళ్లకు చేరుకున్నారు.

ఇదీ చదవండి:చైనాను దాటిన ఇటలీ- 3,400కు చేరిన కరోనా మృతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.