ETV Bharat / international

చైనాలో మళ్లీ కరోనా 'లోకల్'​ కేసులు- కొత్తగా 6 మరణాలు

కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న చైనాను మళ్లీ కొత్త కేసులు భయపెడుతున్నాయి. మూడు రోజుల తర్వాత చైనాలో నేడు తొలి లోకల్ కరోనా కేసు నమోదైంది. కొవిడ్​-19 ధాటికి మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

corona cases rise in china
చైనాలో మళ్లీ కరోనా కలవరం
author img

By

Published : Mar 22, 2020, 12:28 PM IST

చైనాలో మళ్లీ కరోనావైరస్​ వ్యాప్తి పెరుగుతోంది. మూడు రోజుల వ్యవధి తర్వాత చైనాలో తొలి లోకల్​ కరోనా కేసు నమోదైంది. విదేశాల నుంచి వచ్చిన వారితో కలిపి నేడు మొత్తం 46(1+45) కేసులు నమోదైనట్లు చైనా ఆరోగ్య​ కమిషన్ ప్రకటించింది.

చైనాలో కొత్తగా 6 కరోనా మరణాలు నమోదయ్యాయి. వీరిలో ఐదుగురు హుబే రాష్ట్రానికి చెందినవారేనని అధికారులు తెలిపారు. తాజా మరణాలతో కలిపి చైనాలో కొవిడ్​-19 ధాటికి మృత్యవాత పడ్డవారి సంఖ్య 3,261కి చేరింది.

వైరస్​కు కేంద్రంగా భావిస్తున్న వుహాన్​లో మాత్రం స్థానికంగా వరుసగా నాలుగో రోజూ ఒక్క కేసుకూడా నమోదుకాలేదని అధికారులు స్పష్టం చేశారు.

చైనాలో కరోనా కేసుల వివరాలు..

  • మొత్తం కేసులు - 81,054
  • మరణాలు - 3,261
  • చికిత్సపొందుతున్న వారు - 5,549
  • పరిస్థితి విషమంగా ఉన్నవారు - 1,845
  • కోలుకుని ఇళ్లకు వెళ్లిన వారు - 72,244

కరోనా వైరస్ ఇతరులకు విస్తరించకుండా దేశమంతా కఠిన ఆంక్షలు విధించింది చైనా. బీజింగ్ సహా పలు ప్రధాన నగరాల్లో క్వారంటైన్​ నిబంధనలు అమలులో ఉన్నాయి. విదేశాల నుంచి బీజింగ్ వచ్చే వారిని 14 రోజులు నిర్బంధంలో ఉంచుతున్నట్లు అధికారులు తెలిపారు.

చైనా సరిహద్దు దేశాల్లో పరిస్థితి..

కరోనాతో హాంకాంగ్​లో శనివారం మరో నలుగురు మరణించారు. హాంకాంగ్​లో కొత్తగా 273, మకావులో 18 కేసులు నమోదయ్యాయి. తైవాన్​లో 153 మందికి కొవిడ్​-19 సోకగా ఒకరు మృత్యువాత పడ్డారు.

ఇదీ చూడండి:ప్రపంచవ్యాప్తంగా 13 వేలు దాటిన కరోనా మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.